For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  "కడప రెడ్ల చరిత్ర"పై వెబ్ సిరీస్: సీమ నిజాల్ని నగ్నంగా చూపిస్తానంటున్న వర్మ

  By Bojja Kumar
  |

  వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ... ఇప్పటికే పలు కాంట్రవర్సల్ సినిమాలు తీశాడు. అయితే తాను తీయాలనుకున్న సంఘటనలను సినిమాల రూపంలో తీయడానికి సెన్సార్ నిబంధనలు అడ్డంకిగా మారడంతో వర్మ వెబ్ సిరీస్ వైపు దృష్టి సారించాడు. ఇప్పటికే ముంబై మాఫియాపై హిందీలో 'గన్స్ అండ్ థైస్' వెబ్ సిరీస్ తీస్తున్న వర్మ... త్వరలో తెలుగులో కూడా వివాదాస్పద వెబ్ సిరీస్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  కడప రెడ్ల చరిత్రపై

  కడప రెడ్ల చరిత్రపై

  ఇప్పటికే రాయలసీమ ఫ్యానిజంపై ‘రక్తచరిత్ర' లాంటి సినిమా చేసిన వర్మ.... త్వరలో కడప రెడ్ల చరిత్రను తన వెబ్ సిరీస్ ద్వారా చూపించబోతున్నారు. కడప రెడ్ల చరిత్రపై తాను తీయాలనుకున్న దానికి వ్యక్తులు, సెన్సార్ నిబంధనలు అడ్డు పడుతుండటంతో వర్మ దాన్ని వెబ్ సిరీస్ రూపంలో తీయాలనుకుంటున్నారు.

  నాగ్ మూవీలో న్యూ హీరోయిన్.. హాట్‌ ఫోటోస్ షేర్ చేసిన వర్మ!
   సద్బుద్ధితో కూడిన దుర్బుద్ధికరమైన సదుద్దేశ్యం

  సద్బుద్ధితో కూడిన దుర్బుద్ధికరమైన సదుద్దేశ్యం

  కడప రెడ్ల చరిత్రపై తీయబోతున్న వెబ్ సిరీస్ గురించి వర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర' వెబ్ సిరీస్ వెనుక నా సద్బుద్ధితో కూడిన దుర్బుద్ధికరమైన సదుద్దేశ్యం ఏమిటంటే.... ' అంటూ దీని గురించి వివరించారు.

  నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వక పోవడం వల్లే...

  నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వక పోవడం వల్లే...

  నేను డిజిటల్ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం..వెండితెర మీద నన్ను నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వని కథల్ని ఎవడినీ కేర్ చెయ్యకుండా నాకిష్టం వచ్చినట్టు చెప్పడం కోసం. ఈ బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం వరల్డ్ ప్రేక్షకుల కోసం ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్లో నేను నిర్మిస్తున్న గన్స్ అండ్ థైస్ సిరీస్ తర్వాత నేను తీస్తున్న మొట్టమొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ "కడప".... అని వర్మ తెలిపారు.

  అందుకే ఆ ప్రాంతం పేరు పెట్టాం

  అందుకే ఆ ప్రాంతం పేరు పెట్టాం

  హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఇగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఒక ప్రాంతం స్ఫూర్తిగా ఈ టైటిల్ పుట్టింది. రక్తచరిత్ర తీస్తున్నప్పటి నుంచి చాలా మంది మాజీ ఫ్యాక్షనిస్టులు, వాళ్ళ బాధితులు, వాళ్ల బంధువులు, వాళ్లింట్లో పని చేసే వాళ్ల నుంచి,మరియు ఎందరి నుంచో నేను డబ్బులిచ్చి,బెదిరించి,మాటలతో మభ్యపెట్టి వాళ్లు గుండెల్లో దాచుకున్న రహస్యాలని బయటికి లాగేసిన మెటీరియల్ నుంచి పుట్టిందే ఈ "కడప" నిజం కథ.... అని వర్మ తెలిపారు.

  కొందరు ఇడియట్లు అలా భావించవచ్చు

  కొందరు ఇడియట్లు అలా భావించవచ్చు

  నేను ఈ సబ్జెక్ట్ ని గతంలో రక్తచరిత్రలో డీల్ చేశాను కదా అని కొందరు ఇడియట్లు భావించవచ్చు. కానీ అది కేవలం 5% మాత్రమే నిజం. దానికి కారణం రక్తచరిత్రలో అసలు నిజాలని చాలా పైపైన చూపించాను. లోలోపలి పూర్తి నిజాలు అప్పటికి నాకు తెలియకపోవడం, కొన్ని వార్నింగ్ లు ఇచ్చి పుచ్చుకోవడం లాంటి ఇతరత్రా కారణాల వల్ల అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపించలేకపోయాను..... అని వర్మ తెలిపారు.

   డిసెంబర్ 15న ట్రైలర్ రిలీజ్

  డిసెంబర్ 15న ట్రైలర్ రిలీజ్

  దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో భయాన్ని నూతిలోకి పారేసి, ఎవడేమి అనుకున్నా, ఎవ్వడేమి ఫీల్ అయినా కేర్ చెయ్యకుండా నిజం కథని నిజంగా చూపించడానికి సైకిల్ చెయిన్ మీద ఒట్టుగా కంకణం కట్టుకున్నాను. ఈ "కడప" వెబ్ సిరీస్ ట్రైలర్ రేపు..అంటే 15 డిసెంబర్ ఉదయం 10 గంటలకి రిలీజ్ అవ్వబోతోంది.... అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

  English summary
  "My only objective of entering into the digital world is to be able to tell a story which I otherwise would have never been allowed to tell on a film screen. My second product on this platform after my Hindi Web series on the Mumbai Mafia called “Guns and Thighs” will be the first ever original Telugu web Series made for an international audience titled KADAPA." RGV said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X