twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లికి ముందు...ఆ తర్వాత ('365 డేస్' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్‌గోపాల్ వర్మ మొదటి నుంచి తను పెళ్లికి వ్యతిరేకమంటూనే చెప్తున్నారు. దానికి తోడు ఆయన వైవాహిక బంధం కూడా అంతగా సక్సెస్ కాకపోవటంతో ప్రతీ సారి అది టాపిక్ గా మారుతూనే ఉంది. ఎందుకు ఆయన భార్యతో విడిపోయి ఉంటున్నారు. ఇష్టపడి చేసుకున్న బంధం ఎందుకు వీగిపోయింది అనే ప్రశ్నలు ఆయన అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో ఆయన వాటికి కొంతవరకూ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాని అంటున్నారు. నిజమెంతో మరికొద్ది గంటల్లో తేలనుంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    365 రోజుల్లో జరిగిన ఆ సంఘటనల సమాహారమే ఈ సినిమా. పెళ్ళికి ముందు, తర్వాత ఓ జంట జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులను ఈ చిత్రంలో చూపించారు. పెళ్లి చేసుకొన్న ఓ ప్రేమ జంట జీవితంలో ఏడాదిపాటు జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఒకరి గురించి మరొకరికి అవగాహన రావడానికి అన్ని రోజులు పడుతుంది. ఆ ఉద్దేశంతోనే '365 డేస్‌' అని పేరు పెట్టారు. ఒక జంట ఏడాది పాటు కలిసి చేసిన ప్రయాణం ఇది. ఫలానా రోజు అలా జరిగింది, ఫలానా రోజు ఏం చేసిందంటే అంటూ... మనం ఎదుటివాళ్లతో చెప్పుకొంటుంటాం. అలా పెళ్లయిన 10వ రోజు, 20 రోజులకి, 47వ రోజు అంటూ భార్యాభర్తల మధ్య జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ స్క్రీన్‌ప్లే రాసారు.

     RGV's 365 Days Telugu Movie preview

    రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ''నేను ప్రేమ, పెళ్లిళ్లకి వ్యతిరేకమని కొందరి భావన. కానీ అది నిజం కాదు. అదే నిజమైతే ఈ సినిమా తీయను. ఎవరి జీవితంలోనైనా ప్రేమ, పెళ్లి ముఖ్యం. అయితే పెళ్లి చేసుకొన్న ఒక్కటైన జంటలు ఎందుకు విడిపోతున్నాయో ఈ చిత్రంలో చూపించా. ఓ జంట మధ్యకి వెళ్లి వాళ్ల జీవితాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగేలా చిత్రాన్ని తెరకెక్కించా'' అన్నారు.

    అలాగే... ''దాదాపుగా ఇది అందరి కథ. ఒక జంట భావోద్వేగాల నేపథ్యంలో ఈ కథ రాసుకొన్నా. పెళ్లి విషయంలో నా అభిప్రాయం కూడా ఈ కథే. చాలా మంది నా పెళ్లి గురించి అడుగుతుంటారు. 'నాకు ఒక మంచి భార్య దొరికింది. నా భార్యకి ఒక చెడ్డ మొగుడు దొరికాడు. అందుకే మా బంధం నిలవలేదు' అని చెబుతుంటా. ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. ఎలాంటి క్రైమ్‌ లేకుండా ఈ సినిమా చేశా'' అన్నారు

    నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- ప్రేమించుకొని ఒక్కటైన జంట పెళ్లి తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? పెళ్లికిముందు ఒకరంటే ఒకరు ఇష్టపడేవారికి, పెళ్లి తర్వాత ఒకరంటే ఒకరికి కోపం ఎందుకు వస్తుంది అనే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందించామని తెలిపారు.

    బ్యానర్ డి.వి.క్రియేషన్స్
    నటీనటులు నందు, అనైకా సోఠి, పోసాని కృష్ణమురళి, గీతాంజలి, రావి కొండలరావు, కృష్ణుడు, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు
    కెమెరా: అనిత్,
    సంగీతం: నాగ్‌శ్రీవాత్సవ, ఎల్.ఎం.ప్రేమ్,
    కథ, మాటలు, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ.
    నిర్మాత: డి.వెంకటేష్
    విడుదల తేదీ: 22, ,మే 2015.

    English summary
    Ram Gopal Varma has come up with a film without villains, blood shed and mafia. His latest film “365 Days” is a pure romantic love story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X