twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చిరు 150 వ చిత్రం' డిజాస్టర్ అవుతుంది

    By Srikanya
    |

    హైదరాబాద్ : చిరంజీవి 150 వ చిత్రం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఈ టాపిక్ ని ఎందుకు వృధా చేసుకోవాలనకున్నారో ఏమో కానీ ...వర్మ ఎప్పటిలాగే తనదైన శైలిలో కామెంటారు. ఆయన ట్వీట్ చేస్తూ "నేను కనుక చిరంజీవి గారి 150 వ చిత్రం కనుక..డైరక్ట్ చేస్తే..అది ఖచ్చితంగా చివరకు డిజాస్టర్ గా మిగులుతుంది " అన్నారు.

    చిత్రం విషయానికి వస్తే...

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు.

    ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.

    RGV's shocker on Mega Star's milestone film

    సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

    కాపీ వివాదం... చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.

    కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా గురించి వార్తలు రావడం, ఇప్పటివరకూ అవి వాస్తవ రూపం ధరించకపోవడం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా రామ్‌చరణ్‌ ఈ సినిమా విషయాన్ని ధృవీకరించంటం అభిమానుల్లో చెప్పలేని ఆనందం కలిగించింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే బండ్ల గణేశ్‌ ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పూరి కూడా తన ఉద్వేగాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోయారు.

    ఇక ఈ చిత్రానికి కథను అందిస్తున్న బీవీఎస్‌ రవి ‘‘మెగాస్టార్‌ నుంచి అంగీకారం పొందడం ఎంతో ఉత్తేజంగా, ఉద్వేగంగా ఉంది'' అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్‌ 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ రోజు ఆయన షష్ఠి పూర్తి కావడం కూడా విశేషం.

    చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్‌దాదా జిందాబాద్‌' 2007 జూలైలో విడుదలైంది. అంటే అది వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి హీరోగా ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారన్న మాట.

    English summary
    Ramu said " If I direct Chiranjeevi garu's 150th movie, it will surely end as a disaster." Film will be directed by Puri Jagannath and produced by Ram Charan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X