»   » సన్నీలియోన్‌లా సంతోషాన్ని పంచండి.. ఉమెన్స్ డే రోజున వర్మ..

సన్నీలియోన్‌లా సంతోషాన్ని పంచండి.. ఉమెన్స్ డే రోజున వర్మ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం సృష్టించడంలో ఎప్పుడూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందుంటారు. మహిళా దినోత్సవాన్నిపురస్కరించుకొని తాజాగా ట్విట్టర్‌లో వర్మ వివాదాస్పద కామెంట్లు చేశారు.

సన్నీలియోన్‌లా ఆనందాన్ని పంచండి

ప్రపంచంలోని మహిళలందరికీ నా ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. శృంగార తార సన్నీలియోన్ ఏ విధంగా అందరికీ సంతోషాన్ని పంచుతున్నారో మీరు అలా ఆనందాన్ని పంచండి అని వర్మ ట్వీట్ చేశారు.

అన్ని రోజులు మగవాళ్లవే

‘పురుషులకు మెన్స్ డే లేదు ఎందుకంటే అన్ని రోజులు మగవాళ్లవే. అందుకే ఒకరోజు ఆడవాళ్లకు కేటాయించారు' అని వర్మ మరో ట్వీట్ చేశారు.

ఉమెన్స్ జరుపుకునేది పురుషులే

‘ఉమెన్స్ డేను తప్పకుండా మెన్స్ డే అని పిలువాలి. ఎందుకంటే మహిళల కంటే ఆ దినోత్సవాన్ని పురుషులే జరుపుకుంటారు కనుక' అని వర్మ వరుస ట్వీట్లు చేశారు.

మహిళా, పురుష దినోత్సవాన్ని కలిపి జరుపుకోవాలి

‘కనీసం పురుషుల దినోత్సవం రోజున గొడవ పెట్టుకోకుండా, అరవకుండా మగవాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి. మహిళల కోసం పురుషులు ఏమి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కానీ ఏదో ఒకరోజు మహిళా, పురుష దినోత్సవాన్ని అందరూ కలిసి జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

English summary
Ram Gopal Varma again strikes in twitter on Womens day. He says I wish all the women in the world give men as much happiness as Sunny Leone gives
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu