»   » గ్యాంగులు పెట్టకముందు... ‌: రామ్ గోపాల్ వర్మ పాత ఫొటోలు

గ్యాంగులు పెట్టకముందు... ‌: రామ్ గోపాల్ వర్మ పాత ఫొటోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాలను, అనుభవాలను అభిమానులతో పంచుకోవడానికి ముందు ఉండే రాంగోపాల్‌వర్మ ఈ సారి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

దర్శకుడిగా ఆయన కెరీర్‌ మొదలుపెట్టిన కొత్తలో సినీ ప్రముఖులు గుణశేఖర్‌, ఉత్తేజ్‌, తేజ, కృష్ణవంశీ, గోపీచంద్‌లతో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 'మేం అందరం వేరేవేరే గ్యాంగులు పెట్టకముందు... ' అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

అదేవిధంగా 'శివ' సినిమా చిత్రీకరణలో నటుడు రఘువరన్‌కు సీన్‌ వివరిస్తున్న ఓ ఫొటోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.

నేను..శ్రీదేవి అంటూ ఈ ఫొటోని షేర్ చేసారు

ఇక రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం విషయానికి వస్తే...

మంచు మోహన్ బాబు, విష్ణులతో ఆ మధ్య ఓ సినిమా చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మంచు మనోజ్ తో ప్రేక్షకులపై ‘అటాక్' చేయడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన సెకండ్ ట్రైలర్ విడుదలైంది. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేసాడు. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇదే.

RGV shared his old photos

జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వడ్డే నవీన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌ చిత్రం 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది. ఈ చిత్రం పూర్తి యాక్షన్ తో రూపొందనుందని సమాచారం. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగ వాడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు.

మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు కరెంట్ తీగ చిత్రం వచ్చింది. సికె ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీ శుభశ్వేతా ఫిలింస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

English summary
Director Ram Gopal Varma shared his old days photos in Twitter.
Please Wait while comments are loading...