»   » ‘బాహుబలి 2’ తర్వాత అంతా అలా ఫీలవ్వాల్సిందే....

‘బాహుబలి 2’ తర్వాత అంతా అలా ఫీలవ్వాల్సిందే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా రిలీజ్ వేళ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో మళ్లీ కాంట్రవర్సల్ ట్వీట్లతో బిజీ అయిపోయారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత దేశంలోని అందరి స్థాయి దిగజారిపోతుందంటూ ట్వీట్స్ చేసాడు.

'రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి-2 విడుదల తరువాత.... దేశంలోని ఫిల్మ్ మేకర్స్ అందరిలో తామంతా అమెచ్యూర్ టీవీ సీరియల్ దర్శకులమనే భావన కలిగేలా చేస్తుందని... నేను స్ట్రాంగ్ గా ఫీలవుతున్నాను అని వర్మ ట్వీట్ చేసారు.


వర్మ ట్వీట్

వర్మ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాహుబలి సినిమాతో పోలుస్తూ ఇతర దర్శకులను, సినిమాలను కించ పరుస్తూ మాట్లాడటం సరికాదనే విమర్శలు వస్తున్నాయి.


రాజమౌళిని ట్విట్టర్లో ఆడుకునే ప్రయత్నం చేసిన వర్మ

రాజమౌళిని ట్విట్టర్లో ఆడుకునే ప్రయత్నం చేసిన వర్మ

రెండు రోజుల క్రితం వర్మ ట్విట్టర్లో బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని ఆడుకునే ప్రయత్నం చేసాడు. దీంతో రాజమౌళి అయ్యా...నన్ను ఒగ్గేయండయ్యా అంటూ వేడుకున్నాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


వర్మకు ట్విట్టర్ నిండా పని

వర్మకు ట్విట్టర్ నిండా పని

ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండనిదే వర్మకు రోజు గడవదు. ఇక బాహుబలి 2 రిలీజ్ ఉండటంతో వర్మకు కావాల్సినన్నికాంట్రవర్సీలు చేసుకునే అవకాశం దొరికినట్లయింది. మున్ముందు వర్మ ఇంకెలా రెచ్చిపోతాడో చూడాలి.
బాహుబలి పార్ట్ 1 సమయంలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ

బాహుబలి పార్ట్ 1 సమయంలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ

బాహుబలి పార్ట్ 1 రిలీజ్ తర్వాత వర్మ మెగా ఫ్యామిలీని, చిరంజీవి, ఇతర మెగా హీరోలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎవరినీ తన ట్వీట్లతో హర్ట్ చేయను అని చెప్పి వర్మ తన మాట ఏ మేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. వర్మ కాంట్రవర్సీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
"I have a strong feeling ssrajamouli 's #Bahubali2 will make rest of all film makers in country feel like amateur TV serial directors" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu