»   » మళ్ళీ ఊరకుక్కలూ అంటూ వర్మ ట్వీట్..... ధన్యవాదాలు చెప్తూనే

మళ్ళీ ఊరకుక్కలూ అంటూ వర్మ ట్వీట్..... ధన్యవాదాలు చెప్తూనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి పై దాడి కి బాలీవుడ్ నుంచి ఇంకా నిరసనలు వస్తూనే ఉన్నాయి. సంజయ్ కి సపోర్ట్ గా మొత్తం బాలీవుడ్ నిలబడింది. సంజయ్ తీస్తున్న కొత్త సినిమా "పద్మావతి" సినిమాలో రాజ్‌పుత్ రాణిగా దీపికా పదుకొణే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీకి రాణి పద్మావతికి మధ్య ప్రేమాయణం జరిగినట్లు దృశ్యాలు చిత్రీకరిస్తున్నారని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తీసిన దృశ్యాలను తొలగించి భన్సాలీ జాతికి క్షమాపణలు చెప్పాలని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్స్ మీదకి వెళ్ళి నానా భీబత్సం సృష్టించిన సంగతి తెల్సిందే...

ఈదాడిని ని మొత్తం బాలీవుడ్ గర్హించింది. ఈ సంగ్ఝటనను ఖండిస్తూ ఈ సంఘటన మీద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించాడు. బ‌న్సాలీపై దాడి చేసిన రాజ్‌పుత్ కార్ణి సేన కార్య‌క‌ర్త‌ల‌ను ఊర‌కుక్క‌ల‌తో పోల్చిన వ‌ర్మ వారిని ముళ్లున్న బూట్ల‌తో త‌న్నాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు.

RGV tweeted again About sanjay leela bansali

భార‌త్‌లో ఇటువంటి దాడులు జ‌ర‌గ‌డం శోచ‌నీయ‌మ‌న్న వ‌ర్మ, మూవీ మేకర్లకు సెన్సార్ బోర్డ్ తో సమస్యలుంటాయనుకున్నా... కానీ సంజయ్ లీలా బన్సాలీ దాడి ఘటనతో ఏ కోతీ, కుక్క, ఆఖరికి గాడిదలు కూడా సెన్సార్ బోర్డ్ అయిపోఅయని అర్థమవుతోంది అంటూ తన కోపాన్ని వెళ్ళ గక్కాడు. ఇక సోనం కపూర్, అనురాగ్ కాష్యప్ లుకూడా స్పందించారు,

అనురాగ్ కశ్యప్ అయితే ఈ దాడి వల్ల తాను రాజ్ పూథ్ అయినందుకు "షేమ్" గా ఫీల అవుతున్నాను అంటూ ఆవెదన గా పోస్ట్ పెట్టాడు. అయితే అందరూ ఉన్నంత సాఫ్ట్ గా మాత్రం వర్మ లేడు. మొదటి రోజే ఊరకుక్కల గుంపు అంటూ నామకరణం చేసిఒన వర్మ రాజ్పూత్ కర్ణి సేన కి అదే పేరుని కన్ ఫార్మ్ చేసాడు.

లేటేస్ట్ గా వర్మ మరోసారి ఊరకుక్కల గుంపు అంటూ కర్ణి సేన మీద విరుచుకు పడ్డాడు. తాజా ట్వీట్ లో "సంజయ్ లీలా ధన్యవాదాలు, ఎందుకంటే అతని వల్లే "పద్మావతీ, ఖ్ల్జీ ఇంకా ఆ ఊరకుక్కల గుంపు అయిన కర్ణి సేనా దేశం మొత్తం చర్చల్లో ఉన్నారు" అంటూ తన ట్విట్టర్ అక్కౌంట్ లో పోస్ట్ చేసాడు. ఇక కింద ఆయనకు సపోర్ట్ గానూ, వ్యతిరేకంగానూ కమెంట్లు వస్తూనే ఉన్నయి. అయినా అవేం పట్టించుకోని వర్మ మరిన్ని ట్వీట్లకి ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు.

English summary
Bollywood Director varam Tweeted again about Karni Sena who created ruckus and vandalised the sets of filmmaker Sanjay Leela Bhansali's 'Padmavati' in Jaipur..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu