»   » పాతికేళ్ళ తర్వాత అదే థియేటర్ లో.... వంగవీటి ప్రకంపన ఇలా ఉంది

పాతికేళ్ళ తర్వాత అదే థియేటర్ లో.... వంగవీటి ప్రకంపన ఇలా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. ఆయన ఎంచుకునే సినిమాలే అలాంటివి. తాజాగా వంగవీటి రంగాపై తీసీన సినిమా ఇవాళ విడుదల అవుతూండటం తో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ''వంగవీటి చరిత్రను సినిమాగా చెప్పాలంటే పది గంటల సమయం కూడా సరిపోదు. రెండున్నర గంటల నిడివిలో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా రియలిస్టిక్‌గా చెప్పాను.

చదువుకొనే రోజుల్లో విజయవాడలో నేను చూసిన రాజకీయం, రౌడీయిజంపై పూర్తి అవగాహనతో నా మనసును, స్టైల్‌ను మార్చుకుని ఈ సినిమా తీశాను'' అని ఒక సందర్బం లో రాంగోపాల్‌వర్మ అన్నారు. కానీ ఇప్పుడు విజయ వాడలో పరిస్థితి మాత్రం కొంచం తీవ్రంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ పరిణామాలపై ఒక ఫోకస్


వంగవీటి రంగ హత్య:

వంగవీటి రంగ హత్య:

మొట్టమొదటి సారిగా BBCలో బెజవాడ పేరు వినబడిన సంఘటన వంగవీటి రంగ హత్య. అప్పట్లో 1988 డిసెంబరు 26న నిరాహారదీక్షలో ఉన్న రంగా భక్తుల వేషదారణలో వచ్చిన ప్రత్యర్దుల చేతిలో హత్య చేయబడ్డారు. ఆయన హత్యతో కోస్తాజిల్లాల్లో దాడులు, ప్రతిదాడులు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ దాడుల అనంతరం తిరిగి 28 ఏళ్ళ తర్వాత డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రంగ జీవిత కథ ఆధారంగా ‘వంగవీటి' అనే సినిమా తెరకెక్కింది.


మెలోడ్రామాను తోడుచేసి:

మెలోడ్రామాను తోడుచేసి:

1970లో జరిగిన చలసాని వెంకటరత్నం హత్య దగ్గర నుంచి 1988లో జరిగిన వంగవీటి రంగా హత్య వరకు జరిగిన పరిణామాలకు మెలోడ్రామాను తోడుచేసి వర్మ, వంగవీటిని తెరకెక్కించారు. వంగవీటి టీజర్ వదలగానే వివాదాలు మొదలయ్యాయి. సినిమాలో రంగాపై అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే అడ్డుకుంటామని రంగా కుమారుడు రాథా హెచ్చరించారు.


వర్మకు వార్నింగ్ :

వర్మకు వార్నింగ్ :

ఇంతలోనే రెండు సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ పాట విడుదల కావడంతో మరో విదాదం తలెత్తింది. వంగవీటి అభిమానులు వర్మకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వంగవీటి కుటుంబ సభ్యులతో వర్మ భేటీ అయ్యారు. ఎవరేమన్నా సినిమా విడుదల చేసి తీరతానని వర్మ గట్టిగా చెప్పారు.


ఎక్కువ థియేటర్లలో:

ఎక్కువ థియేటర్లలో:

వంగవీటి అభిమానులు భారీగా ఉన్నవిజయవాడలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే థియేటర్ల యజమానులు మాత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రాలేదని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. తనవంతుగా కాస్త కాస్త పెట్రోల్ పోస్తూ వచ్చాడు వర్మ


ఏం జరుగుతుందో:

ఏం జరుగుతుందో:

వంగవీటిని సినిమాగానే చూస్తున్నామని, ఇందులో వ్యక్తిగత అంశాలకు తావులేదని ప్రకటించిన నెహ్రూ, వర్మకు మద్దతు పలికారు. దీంతో వంగవీటి టీమ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ సినిమా విడుదల దగ్గర పడేకొద్దీ ఏం జరుగుతుందోనన్న అనుమానం మాత్రం అందరి గుండేల్లో ఉంటూనే వచ్చింది


తనకు తానే కితాబు:

తనకు తానే కితాబు:

వంగవీటి' టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ‘సినిమాల గురించి తక్కువగా..వివాదాల గురించి ఎక్కువగా' మాట్లాడే వర్మ వంగవీటి తన కేరీర్‌లోనే ది బెస్ట్ మూవీ అంటూ తనకు తానే కితాబు ఇచ్చుకున్నారు. శివ సినిమాతో టాలీవుడ్‌ను షేక్ చేసిన ఆర్జీవీ మరోసారి అలాంటి సక్సెస్ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.


బెజవాడలో ఊపేసిన రౌడీయీజం:

బెజవాడలో ఊపేసిన రౌడీయీజం:

గతం లో తీసిన గాయం, బెజవాడ సినిమాలలో కూడా విజయవాడ రాజకీయాల నేపథ్యం లోనే తీసిన వర్మ ఇంత వ్యతిరేకతని అప్పుడు ఎదుర్కోలేదు.. మాఫియా, రౌడీయీజాన్ని కొత్తగా చూపించడంలో వర్మకు టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ ప్రత్యామ్నాయం లేదు. 1970లో బెజవాడలో ఊపేసిన రౌడీయీజం, హత్యలు, రాజకీయాలు అనంతర పరిణామాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.


అలంకార్ థియేటర్‌‌:

అలంకార్ థియేటర్‌‌:

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది... అదేంటంటే రంగా హత్యతో అప్పట్లో అనేక లూటీలు జరిగాయి...పలు సినిమా హాల్స్ పై దాడులు జరిగాయి. బెజవాడ నగరం నడి బొడ్డున వున్న అలంకార్ థియేటర్‌‌ను "రంగా" అభిమానులు పూర్తిగా కాల్చి వేసారు. మొండి గోడలు మాత్రమే మిగిలాయి.


అదే అలంకార్ థియేటర్‌‌లో:

అదే అలంకార్ థియేటర్‌‌లో:

అయితే దాదాపు కొన్ని నెళ్ల పాటు ఆ సినిమా హాలు అలాగే బోసిగా వుండి పోయింది. ఇప్పుడు అదే అలంకార్ థియేటర్‌‌లో శుక్రవారం వంగవీటి సినిమా విడుదల కావటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇవాళ సినిమా రిలీజ్‌ కానుండటంతో గొడవలు జరగకుండా ఉంటేందుకు గట్టి భద్రత చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు.


English summary
The Political Capital of Andhra Pradesh, Vijayawada is seeing a high tension environment today., RGV Vangaveeti Movie Release Creates High Tension In Vijayawada
Please Wait while comments are loading...