For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్కలే ఆత్మహత్యకు ప్రేరేపించారు... సుశాంత్ సోదరీమణులపై రియా FIR

  |

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన దగ్గర నుంచి, కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో డ్రగ్స్ మాఫియా హస్తంపై లోతైన విచారణ జరుగుతుండగా, ఎన్నో చేదు నిజాలు బట్టబయలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిలో అనుమానస్థురాలిగా మారిన రియా చక్రవర్తి, ఇప్పుడు ఎదురునిలిచి పోరాడేందుకు సిద్ధమైంది.

  ఎదురు నిలిచి పోరాడటమే బెటర్... !

  ఎదురు నిలిచి పోరాడటమే బెటర్... !

  ఇన్నాళ్లూ సుశాంత్ కుటుంబం నుంచి ఎదురవుతున్న విమర్శనా బాణాను తట్టుకుని నిలబడిన రియా, ఇకపై మౌనంగా ఉండటం ఎంత మాత్రమూ శ్రేయస్కారం కాదని తెలుసుకున్నట్లు ఉంది. అందుకే, తనపై ఎక్కుపెట్టిన బాణాలను తప్పించుకుంటూ ప్రత్యర్ధులపైనా ఎదురు దాడికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్ అక్కలపై FIR నమోదు చేసింది.

  వాళ్లే అసలైన హంతకులు...!

  వాళ్లే అసలైన హంతకులు...!

  సుశాంత్ మరణానికి అతడి అక్కలే కారణమని, అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించింది వారేనని పేర్కొంటు, ప్రియాంకా సింగ్, మీతూ సింగ్ లపై FIR ఫైల్ చేసింది రియా. ఈ మేరకు ముంబై పోలీసులు సైతం FIR నమోదు చేసుకున్నారు. అక్కలు ఇద్దరితో పాటూ, బ్యాన్ అయిన మందులను ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ తరుణ్ కుమార్ పేరును FIRలో చేర్చారు.

  బ్యాన్ అయిన మందులు సూచించారు...!

  బ్యాన్ అయిన మందులు సూచించారు...!

  డాక్టర్ తరుణ్ కుమార్... నార్కోటిక్ డ్రగ్స్, సైకోటిక్ సబ్స్టాన్స్ యాక్ట్ ప్రకారం బ్యాన్ చేసిన పలు ముందులనే సుశాంత్ కు సూచించారని రియా తాను ఫైల్ చేసిన FIR లో ప్రేర్కొంది. ఎలాంటి గుర్తింపు లేని ఈ అనధికార ప్రిస్క్రిప్షన్ ను మీతూ సింగ్ సుశాంత్ కు పంపిందని వెల్లడించింది. సుశాంత్ సోదరీమణులపై సెక్క్షన్ 420, 464, 465,466, 458, 474, 306, 120(B), and 34 ఐపీసీ సెక్షన్లకింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

  సుశాంత్ అక్క ఆ టైప్!

  సుశాంత్ అక్క ఆ టైప్!

  మరోవైపు, సుశాంత్ అక్క ప్రియాంక పై ముందు నుంచీ ఆరోపణలు చేస్తూనే ఉన్న రియా, దీని మీదా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ప్రియాంకా తనతో పలు మార్లు అభ్యంతరపూర్వకంగా ప్రవర్తించిందని, తనను వేధింపులకు గురి చేసిందని, అక్కడితో ఆగకుండా తనపై లైంగిక సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చిందని FIRలో పేర్కొంది.

  Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
  ఇది కొత్త నాటకం....

  ఇది కొత్త నాటకం....

  మరోవైపు సుశాంత్ సింగ్ కుటుంబానికి చెందిన లాయర్ వికాస్ సింగ్ రియా FIRపై గట్టిగానే స్పందించారు. పోలీసులు రియా కంప్లైంట్ ను స్వీకరిస్తే, ఈ వ్యవహారం సుప్రీమ్ కోర్టుకు వెళుతుందని స్పష్టం చేశారు. తనకు రియా FIRకు సంబంధించిన నోటీసులు అందాయని, ఇదంతా ముంబై పోలీసులకు కాస్త పనికల్పించే ప్రక్రియ తప్పితే మరేమీ లేదని వెల్లడించారు. అంతేకాదు, ఈ విధంగా వారి ద్వారా సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగకుండా చేసేందుకు ప్రయత్నాలు నుస్తున్నాయని వెల్లడించారు సింగ్.

  English summary
  Rhea Chakraborty files FIR against SSR's Sisters as she accuses his sister's of abetment of his suicide. FIR has been Registerd against SSR's Sisters Priyanka Singh and Mitu Singh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X