హైదదారాబాద్ : రెండు రోజుల్లో రిచా గంగోపాధ్యాయ నటించిన 'భాయ్' రిలీజ్ అవుతుందనగా ఆమె ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. తను కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోనని చెప్పి అమెరికా వెళ్లిపోయింది. తొలి నుంచీ రెండో హీరోయిన్ స్థానమే. 'మిర్చి'లోనూ రెండో హీరోయినే . అయితే ఆ విజయంతో సోలో హీరోయిన్ గా ప్రమోషన్ సంపాదించింది. 'భాయ్'లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తరవాత ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయి అనుకొంటే... తాత్కాలిక విరామం ప్రకటించేసింది. చదువుల కోసం అమెరికా వెళ్లిపోయింది. దాంతో ఆమెతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న దర్శక,నిర్మాతలు షాక్ అయ్యారు. 'భాయ్'హిట్ అవుతుందని, ఆమెకు మంచి క్రేజ్ వస్తుందని,తమ సినిమాల్లో తీసుకోవచ్చని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.
ఈ విషయమై రిచా మాట్లాడుతూ..''నాకు చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. సినిమాల కారణంగా చదువును పక్కన పెట్టా. ఈసారి ఎలాగైనా డిగ్రీ పట్టా తెచ్చుకోవాలని వుంది. అందుకే సినిమాల నుంచి విరామం తీసుకొన్నా. ఇది తాత్కాలిక విరామం మాత్రమే. మళ్లీ నా చదువు పూర్తయ్యాక తిరిగి వస్తా'' అంది.
నాగార్జున హీరోగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'భాయ్' అక్టోబర్ 25న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డమరుకం తర్వత నాగార్జున నటించిన సినిమాలేవీ రాక పోవడంతో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను తెరకెక్కించారు.
Richa has tweeted: "I was thinking deeply for the last one year if I want to just continue doing films or pick up my studies in the US where I left off when I moved to India in 2008 to try my luck in films. I intentionally did not want to sign other films after Bhai this year, even though I have been getting many offers, as I did not want to leave the projects midway. I am taking a break from acting for a while to finish up my studies and even pursue higher studies in the US. I am not quitting films, just prioritizing academics at this juncture in my life."
Story first published: Tuesday, October 22, 2013, 8:19 [IST]