RIP BA Raju: నేను అప్పుడే మరణించా.. నా రూపంలో మా ఆవిడ.. బీఏ రాజు ఎమోషనల్‌గా...

ప్రముఖ సినీ జర్నలిస్టు, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఆకస్మిక మరణంపై సినీ వర్గాలు, సినీ పాత్రికేయులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. సినీ పరిశ్రమలోని తారలందరూ బీఏ రాజు మరణంపై సంతాపాలు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చూస్తూ..

భార్య జయ మరణించిన సమయంలో

భార్య జయ మరణించిన సమయంలో


ప్రముఖ సినీ రచయిత భాస్కరభట్ల స్పందిస్తూ.. దర్శకురాలు జయ మరణించినప్పుడు బీఏ రాజు చెప్పిన మాటలు గుర్తు చేసుకొన్నారు. జయగారు పోయినప్పుడు వెళ్లి రాజు గార్నీ ఓదార్చబోతే . నేను మరణించాను.. ఆవిడే బతికి ఉంది నా రూపంలో అని ఆయన ఒకే మాట అన్నారు. ఎంత ప్రేమతో కూడిన మాట అది! రాజు గారూ శ్రద్దాంజలి అంటూ భాస్కర భట్ల ట్వీట్ చేశారు.

నా గుండె ముక్కలైంది..

నా గుండె ముక్కలైంది..


సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ ట్వీట్ చూస్తూ.. .బీఏ రాజు మరణంతో నా గుండె ముక్కలైనంత పని అయింది. నాకు మంచి స్నేహితుడు. మాకు ఎప్పుడూ చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. నిజంగా ఆయనను పోగొట్టుకొన్నాం. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆత్మకు శాంతి చేకూరాలి. బీఏ రాజు సూపర్ హిట్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.

బీఏ రాజు మరణం షాక్

బీఏ రాజు మరణం షాక్

సినీ నటి, దర్శకురాలు జీవిత సంతాపం వ్యక్తం చేస్తూ... తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల నుంచి మాకుబీఏ రాజు తో పరిచయం ఉంది. ఎటువంటి కల్మషం లేని మంచి మనిషి. మేం నటించిన చాలా చిత్రాలకు, మాకు పర్సనల్ పీఆర్వోగానూ పని చేశారు. కొన్నేళ్లు రాజశేఖర్ డేట్లు చూశారు. బీఏ రాజు మరణం మమ్మల్నిషాక్‌కి గురి చేసింది. ఎంతో బాధగా ఉంది. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు రాజుగారి కుటుంబ సభ్యులకు వ్వాలనికోరుకుంటున్నాం అని అన్నారు.

అద్బుతమైన వ్యక్తి అంటూ దుల్కర్

అద్బుతమైన వ్యక్తి అంటూ దుల్కర్


పీఆర్వో బీఏ రాజు ఆకస్మిక మరణం అత్యంత విషాదానికి గురిచేసింది. సినిమాలను ప్రమోట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అద్బుతమైన సినిమా నాలెడ్జి ఉన్న వ్యక్తి. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉండేవారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అంటూ దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశారు.

తీవ్ర విషాదానికి గురయ్యా.. కియారా అద్వానీ

తీవ్ర విషాదానికి గురయ్యా.. కియారా అద్వానీ


మంచితనం, సానుకూల దృక్బథంతో ఎప్పుడూ కనిపిస్తారు. ఆయన మరణవార్త విని తీవ్ర విషాదానికి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం అని కియారా అద్వానీ ట్వీట్ చేశారు.

మా కుటుంబ సభ్యుడిగా

మా కుటుంబ సభ్యుడిగా

మాపై అత్యంత ప్రేమను కురిపించే వ్యక్తి ఇక లేరంటే నమ్మలేకపోతున్నాం. ఆయన ప్రవర్తన, ప్రేమ ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్‌ను వ్యక్తిగత రిలేషన్‌గా మార్చింది. బీఏ రాజు హఠాన్మరణం మమల్ని తీవ్రమైన షాక్ గురిచేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం అని సూర్య ట్వీట్ చేశారు.

హీరో కార్తికేయ ట్వీట్

హీరో కార్తికేయ ట్వీట్


బీఏ రాజు గారు ఆకస్మిక మరణం మమల్ని తీవ్ర విషాదానికి, దిగ్బ్రాంతికి గురిచేసింది. సానకూల దృక్బథంతో ఉండే మధురమైన వ్యక్తి. సినిమా పరిశ్రమకు తీరని లోటు అని హీరో కార్తికేయ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X