RIP Madonna: పప్పులో కాలేసిన నెటిజన్లు.. మారడోనాకు బదులు పాప్ దేవతకు శ్రద్దాంజలి

అర్జెంటీనా క్రీడాకారుడు, ఫుట్ బాల్ మాంత్రికుడు డిగో అర్మాండో మారడోనా గుండెపోటుతో బుధవార (నవంబర్ 25వ తేదీన) మరణించడం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రపంచం గర్వించిన దిగ్గజ క్రీడాకారుడి మరణంపై నెటిజన్లు భారీగా తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే నెటిజన్లు పప్పులో కాలేసి మారడోనాకు బదులు మడోనాకు సంతాపం తెలియచేయడం ఇప్పడు ట్రెండింగ్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

మారడోనా మృతితో నెటిజన్లు

మారడోనా మృతితో నెటిజన్లు

మారోడోనా మృతి విషయం రాగానే సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ RIP అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే కొందరు మారడోనాకు బదులుగా మడోనాకు శ్రద్దాంజలి ఘటించారు. #RIPMadonna అంటూ పోస్టులు పెట్టారు. దాంతో గందరగోళం నెలకొన్నది.

 మారడోనాకు బదులు మడోన్నాకు శద్దాంజలి

మారడోనాకు బదులు మడోన్నాకు శద్దాంజలి

ఇక సోషల్ మీడియాలో మారడోనాకు బదులు మడోన్నా శ్రద్దాంజలి ఘటిస్తూ.. ‘మడోన్నా నీ ఆత్మకు శాంతి కలుగాలి. ఇంత త్వరగా ఈ లోకం నుంచి వెళ్లిపోతావనుకోలేదు', ‘మడోన్నా నిజమైన ఐకాన్, మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను', ‘RIP మడోన్నా ఎప్పటికీ నా హృదయంలో ఉండిపోతారు. నీవు నిజమైన లెజెండ్' అంటూ కామెంట్లు పెట్టారు.

ట్రెండింగ్‌లోకి మడోన్నా

ట్రెండింగ్‌లోకి మడోన్నా

నెటిజన్లు పప్పులో కాలేసి మారడోనాకు బదులు మడోన్నాకు శ్రద్దాంజలి ఘటించడంపై నెటిజన్లు సరిద్దిద్దే ప్రయత్నం చేశారు. మడోన్నా ఇంకా జీవించే ఉన్నారు. చనిపోయింది ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మారడోనా అంటూ క్లారిటీ ఇచ్చారు. అప్పటికే మడోన్నాకు RIP అంటూ సోషల్ మీడియాలో పోస్టులు భారీగా వెల్లువెత్తడంతో #RIPMadonna ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాంతో తన ప్రమేయం లేకుండానే మడోన్నా పేరు వైరల్ అయింది.

Recommended Video

Irrfan Khan To Act Prabhas And Nag Ashwin's Movie But We Missed Him In Second Telugu Movie
మడోన్నా గురించి

మడోన్నా గురించి

ఇక మడోన్నా విషయానికి వస్తే.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత నటి, గాయని, స్క్రిప్టు రైటర్. అభిమానులు ఆమెను క్వీన్ ఆఫ్ పాప్ అని ముద్దుగా పిలుచుకొంటారు. ఈమెకు ముగ్గురు భర్తలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. తొలుత ప్రముఖ హాలీవుడ్ నటుడు సీన్ పెన్‌ను వివాహం చేసుకొన్నారు. 1985 నుంచి 1989 వరకు వీరి దాంపత్యం జీవితం కొనసాగింది. ఆ తర్వాత సీన్ పెన్‌తో విడిపోయి గయ్ రిచీ అనే సినీ ప్రముఖుడిని పెళ్లాడింది. 2000 నుంచి 2008 వరకు కలిసి ఉన్నారు. ప్రస్తుతం కార్లోస్ లియాన్‌తో సహజీవనం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X