»   » నీ వల్లే సినిమా ప్లాప్ అయింది: రచ్చకెక్కిన వివాదం, భారీ నష్టం!

నీ వల్లే సినిమా ప్లాప్ అయింది: రచ్చకెక్కిన వివాదం, భారీ నష్టం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, హాట్ బ్యూటీ కత్రినా హీరో హీరోయిన్లుగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జగ్గా జాసూస్'. దాదాపు రూ. 100 కోట్లకుపైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం జులై 14న విడుదలైంది. సినిమా రిలీజైన తొలి షో నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ నష్టాలు తప్పలేదు.

ఈ సినిమాను హీరో రణబీర్ కపూర్ స్వయంగా నిర్మించారు. విడుదలై వారం రోజులుపైనే అయినా బడ్జెట్లో సగం కూడా రాబట్ట లేక పోయింది. 8వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల రూ. 45 కోట్లకు మించలేదు. ప్రేక్షకులు లేక థియేటర్లు బోసిపోతుండటంతో చాలా చోట్ల సినిమా ఎత్తివేసే పరిస్థితి. దీంతో రణబీర్ తండ్రి, ప్రముఖ నటుడు రిషి కపూర్ దర్శకుడిపై మండి పడ్డారు. అతడి వల్లే సినిమా ప్లాప్ అయిందని ఫైర్ అయ్యారు.

అనురాగ్ బసు ఎవరి అభిప్రాయం తీసుకోలేదు

అనురాగ్ బసు ఎవరి అభిప్రాయం తీసుకోలేదు

సినిమా విడుదలకు ఒక రోజు ముందు మాత్రమే నేను, నీతూ కలిసి సినిమా చూశాం. అంతకు ముందు రోజు వరకు అనురాగ్ బసు సినిమాలో ఏదో మిక్సింగ్ చేస్తూనే ఉన్నారు. కేవలం వారం ముందే మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ తన పని పూర్తి చేశారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అనురాగ్ బసు కూడా ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు అని రిషి కపూర్ మండి పడ్డారు.

Sridevi Memorized her Career Starting days in film industry
న్యూక్లియర్ బాంబు తయారు చేస్తున్నట్లు ఫీలవుతున్నారు

న్యూక్లియర్ బాంబు తయారు చేస్తున్నట్లు ఫీలవుతున్నారు

ఈ తరం ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇలానే చేస్తున్నారు. సినిమా విడుదల ముందు అనుభవం ఉన్నవారికి సినిమా చూపించడం, వారి అభిప్రాయాలు తీసుకోవడం లాంటివి చేయడం లేదు. తాము ఏదో న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తున్నట్లు ఫీలవుతున్నారు అని రిషి కపూర్ మండి పడ్డారు.

బాధ్యత లేని దర్శకుడు

బాధ్యత లేని దర్శకుడు

అనురాగ్ బసు ఒక బాధ్యతలేని దర్శకడు. అతడు అలాంటి వాడు కాబట్టే ఏక్తా కపూర్ ఆమె సినిమా నుండి అతడిని బయటకు పంపేసింది. ఈ విషయంలో ఆమెతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. రాకేష్ రోషన్‌తో కైట్స్(2010) సినిమా తీసేప్పుడు కూడా అనురాగ్ చాలా సమస్యగా మారాడు. అతడు బాధ్యతలేని దర్శకుడు, సినిమాను సమయానికి పూర్తి చేయడు అని.... రిషి కపూర్ ఆరోపించారు.

ఆలస్యం కావడం వల్లే అక్కడ రిలీజ్ కాలేదు

ఆలస్యం కావడం వల్లే అక్కడ రిలీజ్ కాలేదు

‘జగ్గా జాసూస్' మూవీ సింగపూర్లో విడుదల కాలేదు. అక్కడ సినిమా రిలీజ్ కావాలంటే ఐదురోజుల ముందుగానే అక్కడ సెన్సార్ కు పంపాలి. కానీ అనురాగ్ చాలా ఆలస్యం చేశాడు. ఇదే కారణంతో గల్ఫ్‌లో కూడా సినిమా విడుదల కాలేదు. దర్శకుడికి ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఏముంటుంది? అతడేమైనా తాజ్ మహల్ నిర్మిస్తున్నట్లు ఫీలవుతున్నాడా? అని రిషి కపూర్ ఫైర్ అయ్యారు.

ప్రతీది క్రియేటివిటీతో ముడిపెట్టొద్దు

ప్రతీది క్రియేటివిటీతో ముడిపెట్టొద్దు

ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన ప్రీతమ్ కూడా చాలా డిలే చేశాడు. దీన్ని ఒక కిడ్స్ ఫిల్మ్ గా ప్రచారం చేశారు. పిల్లల సినిమా అని ప్రచారం చేసినపుడు దాన్ని స్కూల్ వెకేషన్స్ సమయంలో రిలీజ్ చేయాలి. కానీ అలా చేయడానికి అనురాగ్ బసు సిద్ధంగా లేడు. ఇందులో ఎకనామిక్స్ అండ్ మాథ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్రతీది క్రియేటివిటీతో ముడిపెట్టి చూడొద్దు అని రిషి కపూర్ అన్నారు.

English summary
Despite garnering critical acclaim, Anurag Basu's ambitious Jagga Jasoos starring Ranbir Kapoor and Katrina Kaif failed to impress the audience and managed to earn Rs. 45 crores in eight days! While Ranbir chose to stay mum over this, his father Rishi Kapoor lashed out at Anurag on the film's poor performance in an explosive interview to Mid-day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu