»   » తండ్రి గురించే ఇలా..., సెక్స్, హీరోయిన్లూ, తాగుడూ అంటూ.., దావూద్ ఇబ్రహిం తో కూడా

తండ్రి గురించే ఇలా..., సెక్స్, హీరోయిన్లూ, తాగుడూ అంటూ.., దావూద్ ఇబ్రహిం తో కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్‌ ఒక నాటి హీరో రిషీ కపూర్ తన ఆత్మ కథ లా ఒక పుస్తకాన్ని రాసాడు. ఈ పుస్తకం లో తన తండ్రి గురించి కూడా చెప్పకూడని విషయాలనీ చెప్పేసాడు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజ్‌ కపూర్‌ ఈయన కూడా ఒకనాటి వెండితెర అగ్రహీరోనే. 64 యేళ్ల ఈ మునుపటితరం హీరో రిషి కపూర్ 'ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్' పేరుతో తన స్వీయ జీవితచరిత్ర పుస్తకాన్ని విడుదల చేశారు.

ఇందులో తన తండ్రి రాజ్‌ కపూర్‌ రాసలీలలు,సినిమాలు, మద్యం, కథానాయికలు.. ఇవే తన తండ్రిలోకమని వెల్లడించాడు. నర్గీస్‌, వైజయంతీమాల తదితర హీరోయిన్లతో తన తండ్రికి ఉన్న సంబంధాలను పూసగుచ్చినట్టు ఆ పుస్తకంలో రిషి కపూర్ వివరించారు. తన చిన్ననాటి అనుభవాలు, తనకొచ్చిన పేరు ప్రతిష్టలు, ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలను ఆ పుస్తకంలో వెల్లడించాడు. అక్కడితోనే ఆగిపోతే ఆ పుస్తకం ఇంత సెన్సేషనల్ ఎందుకవుతుందీ..

అందుకే ఇంకో అడుగు ముందుకు వేసి మాఫియాడాన్ దావూద్‌ ఇబ్రహీంతో రెండుసార్లు కలిసిన సందర్భంగా అనుభవాలను కూడా విపులీకరించారు.భారత మోస్ట్‌ వాంటెడ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను తాను దుబాయ్‌లో రెండుసార్లు కలిశానని.. అతడితో కలిసి టీ తాగానని చెప్పి మొదటి సంచలనానికి తెరలేపాడు. ఇంకా పుస్తకం లోపలికి వెళ్తే ఎన్ని ఉంటాయో గానీ... ఆ పుస్తకం లోని కొన్ని భాగాలు ఇవీ.....

 రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్‌:

రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్‌:

‘ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్‌' పేరుతో విడుదల చేసిన తన స్వీయ జీవితచరిత్ర పుస్తకంలో. తన తండ్రి రాజ్‌కపూర్‌ గురించి.. తన చిన్ననాటి అనుభవాల గురించి.. తనకొచ్చిన పేరు ప్రతిష్ఠల గురించి.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలను ఆ పుస్తకంలో రాసిన రిషీ రెండుసార్లు దావూద్‌ ఇబ్రహీంను కలిసిన సందర్భాల గురించి అందులో వివరించాడు.

 దావూద్‌ సాబ్‌ మీతో మాట్లాడతారట:

దావూద్‌ సాబ్‌ మీతో మాట్లాడతారట:


మొదటిసారి 1988లో దుబాయ్‌లో ‘ఆశా భోంస్లే-ఆర్డీ బర్మన్‌ నైట్‌' కార్యక్రమం కోసం స్నేహితుడు బిట్టు ఆనంద్‌తో కలిసి వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్టులో దావూద్‌ మనుషుల్లో ఒకడు రిషీకపూర్‌ వద్దకు వెళ్లి ‘దావూద్‌ సాబ్‌ మీతో మాట్లాడతారట' అంటూ అతడి చేతికి ఒక ఫోన్‌ ఇచ్చాడట. రిషీకపూర్‌ మాట్లాడగా.. దావూద్‌ అతణ్ని ఆ రోజు సాయంత్రం తన ఇంటికి ఆహ్వానించాడట.

 రోల్స్‌ రాయ్‌స్‌ కారులో:

రోల్స్‌ రాయ్‌స్‌ కారులో:


రిషీ అంగీకారం తెలపడంతో.. అతణ్ని, అతడి స్నేహితుణ్ని కొత్తగా మెరిసిపోతున్న రోల్స్‌ రాయ్‌స్‌ కారులో ఎక్కించుకుని, ఏ దారిలో వెళ్తున్నారో వారికి తెలియకుండా అనేక మలుపులు తిరుగుతూ చివరికి దావూద్‌ ఇంటికి తీసుకెళ్లారట. అక్కడ దావూద్‌ రిషీకి ఘనస్వాగతం పలికి..

 రిషీకపూర్‌ పాత్ర పేరు దావూద్‌:

రిషీకపూర్‌ పాత్ర పేరు దావూద్‌:


తాను మద్యం తాగనని, ఎవరికీ ఇవ్వనని అందుకే టీకి పిలిచానని చెప్పి చాయ్‌, బిస్కెట్లు ఇచ్చాడట. రిషీతో కాసేపు మాట్లాడిన దావూద్‌.. ‘తవాయిఫ్‌' సినిమాలో రిషీకపూర్‌ పాత్ర పేరు దావూద్‌ అయినందున ఆ సినిమా అంటే తనకు ఇష్టమని చెప్పాడట. తాను చేసే పనుల గురించి చెప్పి, అలా చేస్తున్నందుకు తానేమీ చింతించట్లేదని కూడా చెప్పాడట.

 అల్లా ఆజ్ఞలకు విరుద్ధంగా :

అల్లా ఆజ్ఞలకు విరుద్ధంగా :


‘నేనెన్నో నేరాలు చేశానుగానీ.. హత్యలు మాత్రం చేయలేదు' అని చెప్పాడట. అయితే, అల్లా ఆజ్ఞలకు విరుద్ధంగా అబద్ధం చెప్పిన ఒక వ్యక్తిని ముంబై కోర్టులో చంపాల్సి వచ్చిందని దావూద్‌ చెప్పినట్టు (ఈ సంఘటన ఆధారంగానే 1985లో సన్నీడియోల్‌ హీరోగా అర్జున్‌ అనే సినిమా వచ్చింది) రిషీ వివరించాడు.

నన్ను అడుగు:

నన్ను అడుగు:

నాలుగు గంటలపాటు సాగిన ఈ భేటీ చివర్లో.. ‘నీకు ఏం కావాల్సి వచ్చినా.. డబ్బు, ఇంకేదైనా సరే.. మొహమాట పడకుండా నన్ను అడుగు' అని రిషీకి చెప్పి మరీ పంపించాడట దావూద్‌. మళ్లీ ఏడాది తిరక్కుండానే.. 1989లో వీరిద్దరూ దుబాయ్‌లోనే రెండోసారి కలిశారు.

 ఆఫర్‌ ఇచ్చాడు:

ఆఫర్‌ ఇచ్చాడు:


ఈసారి రిషీకపూర్‌ తన భార్య నీతూతో కలిసి ఒక లెబనీస్‌ షాపులో బూట్లు కొనుక్కోవడానికి వెళ్లగా.. దావూద్‌ కూడా అక్కడ ఉన్నాడట. చేతిలో మొబైల్‌ ఫోన్‌, చుట్టూ 8-10 మంది బాడీగార్డులతో ఉన్నాడని.. షాపులో తనకు కావాల్సినవి తీసుకోవాల్సిందిగా ఆఫర్‌ ఇచ్చాడని, తాను ‘నో' చెప్పానని రిషీ కపూర్‌ పుస్తకంలో పేర్కొన్నాడు. అంతే కాదు.. దావూద్‌ ఇబ్రహీం అప్పుడు రిషీకపూర్‌కు తన మొబైల్‌ నంబర్‌ ఇచ్చాడని చెప్పాడు.

 ఇండియాలో :

ఇండియాలో :


భారత్ లో తనకు న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే పారిపోయి వచ్చానని... ఇండియాలో ఎంతో మంది రాజకీయ నాయకులు తన జేబులో ఉన్నారని, వారికి తాను చాలా డబ్బు ఇచ్చానని కూడా రిషీకి దావూద్‌ చెప్పాడట. ఈ రెండు విషయాలకే దేశం మొత్తం ఈ పుస్తకం పైనే చర్చించుకోవటం మొదలు పెట్టింది. ఇప్పటికే పుస్తకం మీద ఆరాలు మొదలయ్యాయట.

English summary
Rishi Kapoor's autobiography Khullam Khulla consists of a lot of revelations that shed light on the lesser known side of the actor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu