twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాల్లో ప్రత్యర్థులు: సినిమాల్లో శృంగార నాయికలు

    By Pratap
    |

    హైదరాబాద్: సినిమాలు సినిమాలు, రాజకీయాలు రాజకీయాలే అంటున్నారు తెలుగు ఫైర్ బ్రాండ్స్ రోజా, విజయశాంతి. చిరంజీవి, బాలకృష్ణ సరసన వారిద్దరు పలు సినిమాల్లో శృంగార నాయికలుగా నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. తమ హీరోలతో డ్యూయెట్లు పాడారు. స్టెప్పులేశారు. ఆ హీరోలు ఈ ఇద్దరు హీరోయిన్లను సినిమాల్లో ఆట పట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే సరికి చిరంజీవి, బాలకృష్ణలపై వారు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

    రాజకీయాల్లో ప్రత్యర్థులు: సినిమాల్లో శృంగార నాయికలు

    వీరిద్దరు కలిసి 18 సినిమాల్లో నటించారని ఓ లెక్క. స్వయంకృషి వంటి సినిమాల్లో భార్యాభర్తలుగా చక్కగా రాణించారు. చాలెంజ్, కొండవీటి రాజా, చిరంజీవి, చాణక్యశపథం, స్వయంకృషి, యముడికి మొగుడు, మంచి దొంగ, యుద్ధభూమి, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు వంటి సినిమాల్లో విజయశాంతి చిరంజీవి సరసన నటించింది. పలు సినిమాల్లో చిరంజీవితో పాటు శృంగార రసాన్ని పండించింది. అయితే, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించన కొత్తలో చిరంజీవితో తనను పొల్చవద్దని చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలిగా ఇప్పుడు చిరంజీవి తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రశ్నిస్తోంది. రాజకీయాల్లో ఇరువురు ఇప్పుడు ప్రత్యర్థులైపోయారు.

    రాజకీయాల్లో ప్రత్యర్థులు: సినిమాల్లో శృంగార నాయికలు

    వీరిద్దరు ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఓ సినిమాలో రోజాను చిరంజీవి ఆట పట్టించే దృశ్యం కూడా ఉంది. అది ముఠామేస్త్రీ సినిమాలో. అయితే, రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులుగా మారారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత రోజా ఆయనపై తీవ్రమైన వాగ్బాణాలను వదిలారు. సినీ పరిశ్రమకు ఏమీ చేయని చిరంజీవి పార్టీ స్థాపించి ప్రజల కోసం పనిచేస్తారని ఎలా అనుకుంటామని ఆమె అడిగారు.

    రాజకీయాల్లో ప్రత్యర్థులు: సినిమాల్లో శృంగార నాయికలు

    వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ముద్దుల మావయ్య వంటి సినిమాల్లో శృంగారాలను ఒలకబోశారు. డ్యూయెట్లతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, భార్గవ రాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, ముద్దుల మేనల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, నిప్పు రవ్వ వంటి సినిమాల్లో విజయశాంతి బాలకృష్ణ సరసన నటించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధపడిన బాలయ్యకు తెరాస పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న విజయశాంతి నుంచి రాజకీయ పోరు తప్పదు.

    రాజకీయాల్లో ప్రత్యర్థులు: సినిమాల్లో శృంగార నాయికలు

    వీరిద్దరు గాండీవం, మాతో పెట్టుకోకు, పెద్దన్నయ్య, సుల్తాన్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఈ సినిమాల్లో రోజాతో పాటు రంభ, మీనా, ఇంద్రజ వంటి హీరోయిన్లు నటించివని కూడా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రోజా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముందుకు వస్తున్న బాలయ్యపై మాటల ఈటెలు విసిరే అవకాశాలున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయారు.

    తెలుగు సినిమా హీరోయిన్లు జయసుధ, కవిత, జయప్రద వంటివాళ్లు రాజకీయాల్లో ఉన్నా చిరంజీవిని, బాలకృష్ణను ఎదుర్కునే ప్రత్యర్థులుగా విజయశాంతిని, రోజాను ప్రధానంగా చెప్పుకోవాలి. జయసుధ ప్రస్తుతం శాసనసభ్యురాలిగా ఉన్నారు. ఆమె కాంగ్రెసు తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచారు. కవిత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన జయప్రద సమాజ్‌వాదీ పార్టీలోకి వెళ్లి ఉత్తరప్రదేశ్ నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    English summary
    The heroines in Telugu films Vijayashanthi and Roja are the political rivals of their heroes Chiranjeevi and Balakrishna. Vijayashanthi acted in many films with Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X