»   » 'రోడ్‌ టు సంగం' దర్శకుడికి 'గొల్లపూడి' అవార్డ్‌

'రోడ్‌ టు సంగం' దర్శకుడికి 'గొల్లపూడి' అవార్డ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా ఇస్తున్న 'గొల్లపూడి' అవార్డ్‌ ఈ సంవత్సరం హిందీ దర్శకుడు అమిత్‌ రాయ్‌ ని వరించింది. అమిత్ రాయ్ హిందీ చిత్రం 'రోడ్‌ టు సంగం' చిత్రంని డైరక్ట్ చేసారు. ఈ మేరకు శ్రీనివాస్‌ స్మారక ఫౌండేషన్‌ ఒక ప్రకటన చేసింది. అమిత్‌ రాయ్‌ కు ఆగస్ట్‌ 12వ తేదీన చెన్నైలో జరిగే కార్యక్రమంలో జ్ఞాపిక, రూ1.5 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కుమారుడు దివంగత గొల్లపూడి శ్రీనివాస్‌ పేరిట ఏర్పాటు చేసిన జాతీయ అవార్డు ఇది. అలాగే గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ అమిత్‌రాయ్‌ 'ఉత్తమ దర్శకుని'గా విమర్శకుల ప్రశంసలందుకున్నారు.

'రోడ్‌ టు సంగం' కథ మెకానిక్ హష్మత్ (పరేష్ రావెల్) పాత్ర చుట్టూ తిరుగుతుంది.అతనో ముస్లిమ్ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీ. ఓ రోజున మ్యూజియం నించి హష్మత్ కి ఓ అరవై ఏళ్ళ పాత ఫోర్డ్ ట్రక్ ఇంజన్ రిపేర్ కి వస్తుంది. బాగుచేసి పంపేలోగా కొన్ని గొడవలు వచ్చిముస్లిమ్ అశోషియేషన్ ప్రెసిడెంట్(ఓంపురి) మేనల్లుడు మరణిస్తాడు. దానికి ప్రభుత్వమే కారణమంటూ ముస్లిమ్ లంతా తమ షాప్ లన్నీ కొన్ని రోజుల పాటు బంద్ చేస్తారు. ఆ సమయంలో హష్మత్ ని టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చెయ్యటానికి వస్తారు.తన దగ్గరకు మీడియా రావటం ఏమిటీ అని ఆశ్చర్య పోయిన అతనికి అప్పుడు అసలు విషయం తెలుస్తుంది.

ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కొన్ని గాంధీ గారి అస్తికలు అలాగే ఓ బాంక్ లాకర్ లో మిగిలిపోయాయని. వాటిని గాంధీ మనవడు తుషార్ అరవై ఏళ్ళ క్రితం వాడిన ఫోర్డ్ ట్రక్ లో తీసుకెళ్లి అలహబాద్ లో నిమజ్జనం చెయ్యాలనుకుంటున్నాడని. ఆ ట్రక్ తాలూకూ ఇంజనే తన దగ్గర ఉందని హష్మత్ కి అర్ధమవుతుంది. అయితే అస్ధికలు కలపే రోజు ఎంతో దూరంలో లేదు. షాపు ఓపెన్ చేయటానికి ముస్లిం సంఘాలు ఒప్పుకోవు. పోనీ వేరే వారి చేత రిపేర్ చేయద్దామంటే అతను తప్ప వేరే వారు చెయ్యటానికి కుదరదు. ఇలాంటి స్ధితిలో అందరినీ ఒప్పించి గాంధీ అస్ధికలను తీసుకెళ్ళటానికి ట్రక్ ని ఎలా రెడీ చేసాడన్న పాయింట్ తో మిగతా కథ నడుస్తుంది. మంచి కథతో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ అంతటా ప్రశంసలు పొంది ఇప్పుడు అవార్డుకు ఎంపికైంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu