»   » నయనతారని అంతలా ఎత్తాల్సిన పని ఆ నిర్మాత, హీరోలకి ఏంటి

నయనతారని అంతలా ఎత్తాల్సిన పని ఆ నిర్మాత, హీరోలకి ఏంటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొత్తం 80 రోజులు షూటింగ్‌ చేసి, సినిమా పూర్తయిన తర్వాతే నయనతార ఫైనల్‌ పేమెంట్‌ తీసుకుంది. డబ్బు మొత్తం చేతిలో పెడితేనే షూటింగ్‌ కి వస్తాం అని డిమాండ్‌ చేస్తున్న ప్రస్తుత పరిస్థితిల్లో నయనతార లాంటివారు ఉండటం ఆశ్చర్యకరం అంటూ ఊదరకొట్టేస్తున్నారు ప్రముఖ కన్నడ నిర్మాత రాక్‌ లైన్‌ వెంకటేష్‌. ఆయన తాజా చిత్రం 'సూపర్‌' లో ఆమె హీరో ఉపేద్ర సరసన చేస్తోంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...నా బేనర్‌లో చాలామంది హీరోయిన్లు యాక్ట్‌ చేశారు కానీ, నయనతారలో ఉన్న మంచితనం ఎవరిలోనూ కనిపించలేదు' అన్నారు. ఇక హీరో ఉపేంద్ర మాట్లాడుతూ...సినిమా ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటివరకు నయనతార వల్ల తమకెలాంటి సమస్య రాలేదని చిత్రకథానాయకుడు ఉపేంద్ర ఆ మధ్య పేర్కొన్నారు. లండన్ ‌లో షూటింగ్ జరిగేటప్పుడు నయనతార ఫైవ్‌ స్టార్‌ హోటల్ ‌లో బస కల్పించమని అడుగుతుందని అనుకున్నాను. కానీ మేం ఏర్పాటు చేసిన సాదాసీదా గదిలోనే తను బస చేసింది అన్నారు. ఇంతకీ నయనతార షూటింగ్ లో ఇబ్బంది పెడుతుందని ఎవరు అన్నారు...ఎందుకీ భుజాలు తడుముకోవటాలు అంటున్నారు కన్నడ జనం. అబ్బే..వాళ్ళంతా నయనతార డేట్స్ దొరకనివాళ్ళు అని సరిపెట్టుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu