»   » వెంకటేష్‌ తో విబేధాలు అందుకే...: రోజా

వెంకటేష్‌ తో విబేధాలు అందుకే...: రోజా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : వెంకటేష్‌గారితో మాత్రం ఓసారి విబేధాలు తలెత్తాయి. అందుకే ఆయన సినిమా అంటే నేను ఉండేదాన్ని కాదు. 'పోకిరిరాజా' ఒక్కటి చేశా... అంతే అంటూ చెప్పుకొచ్చారు రోజా. ఆ గొడవ గురించి చెప్తూ... 'చినరాయుడు' ముందు మాట ఇది అంటూ గుర్తు చేసుకున్నారు. ఆమె తెలుగు డైలీ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం తెలియచేసారు.

ఆమె మాటల్లోనే... మా వారికి... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అందరూ ఫ్రెండ్సే. కానీ వెంకటేష్‌గారితో సినిమా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. వెంకటేష్, విజయశాంతి జంటగా సెల్వమణి దర్శకత్వంలో సినిమా ఓపెనింగ్ కూడా భారీగా జరిగింది. సీఎల్ నరసారెడ్డిగారు నిర్మాత అనుకుంటా.. గుర్తులేదు. సెల్వ లొకేషన్లు చూసే పనిలో ఉన్నాడు. ఇంతలో తమిళంలో 'చినగౌండర్' విడుదలవ్వడం, దాని హక్కులు కొనేసి వాళ్లు బి.గోపాల్‌గారితో వెళ్లిపోవడం జరిగింది. సెల్వ చాలా బాధపడ్డాడు. అవమానంగా ఫీలయ్యారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు వెంకటేష్‌గారి 'పోకిరిరాజా' సినిమా ఒప్పుకున్నా. నా క్యారెక్టర్‌ని కూడా షూట్ చేసేశారు. అయితే... మళ్లీ ఓ చిన్న సాంగ్ బిట్ రీషూట్ చేయాలి బెంగళూర్ రమ్మంటే వెళ్లాను. మూడు రోజులు అక్కడే కూర్చోబెట్టారు. ఆ రోజు అక్టోబర్ 22. సెల్వ పుట్టినరోజు. సో... నేను ఎట్టి పరిస్థితుల్లో చెన్నయ్‌లో ఉంటాలి. అప్పటికింకా మేం పెళ్లి చేసుకోలేదు. ప్రేమలో ఉన్నాం. అందుకే ఆలోచించకుండా వెళ్లిపోయాను. వెంకటేష్‌గారు రమ్మంటున్నారని ఫోన్ చేశారు. నాకు సెల్వ కంటే... సినిమాలు ఎక్కువ కాదని చెప్పేశాను. అప్పట్నుంచీ కొంత గ్యాప్.

వెంకటేష్ సినిమాల్లో నేను ఉండేదాన్ని కాదు. నేను తమిళంలో హీరోయిన్ గా నటించిన పలుచిత్రాల తెలుగు రీమేక్స్‌లో వెంకటేష్‌గారే హీరో. కానీ హీరోయిన్‌గా మాత్రం నా ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉండేవారు. నేను మామూలుగానే చాలా స్ట్రైట్ ఫార్వార్డ్. అందుకే ఏ సినిమా చేసినా ఎక్కడో ఒకచోట మాట పట్టింపులొచ్చేవి. కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకునేదాన్ని కాదు. అందుకే కె.రాఘవేంద్రరావుగారు కూడా నన్ను హీరోయిన్‌గా పెట్టుకునేవారు కాదు.

'ముగ్గురు మొనగాళ్లు' సినిమాకి తీసుకున్నారంటే.. అది చిరంజీవిగారి వత్తిడి మీద జరిగింది. 'అన్నమయ్య'లో కూడా మోహన్‌బాబుగారి పక్కన ఫస్ట్ అనుకుంది నన్ను కాదు. వేరే హీరోయిన్‌ను! 'ఏం.. ఎవరిని పడితే వాళ్లను మా పక్కన పెడతారా? రోజాను పిలవండి' అని మోహన్‌బాబు అంటే... తప్పనిసరై నన్ను పిలిపించారు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. చిరంజీవి గురించి చెప్తూ...చాలా బావుండేవారు. ఆయన ఫ్యామిలీలో నేనూ ఓ మెంబర్‌లా మసిలేదాన్ని. చిరంజీవిగారితో నేను చేసిన తొలి సినిమా 'ముఠామేస్త్రి'. ఆ సినిమాలో 'ఎంతఘాటు ప్రేమయో పారిజాతమా..' మా ఇద్దరిపై తీసిన తొలిపాట. ఆ పాటలో మా మూమెంట్స్ చూసి... చిరంజీవిగారితో ఆయన భార్య సురేఖ ఒకేమాటన్నారు. 'మీ పక్కన దీటుగా డాన్స్ చేయాలంటే... శ్రీదేవి, రాధ, తర్వాత రోజానే' అని. ఆ టైమ్‌లో నాకది పెద్ద కాంప్లిమెంట్ అన్నారామె.

English summary
Roja says that she has differences with Venkatesh at the time of Pokiri Raja. She clarifies that at that time she is in love with Selva Mani. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu