»   »  చిరంజీవితో రోజా ఇంటర్వ్యూ: లైవ్లీగా ముచ్చటిస్తూనే ఇరికించే ప్రయత్నం...

చిరంజీవితో రోజా ఇంటర్వ్యూ: లైవ్లీగా ముచ్చటిస్తూనే ఇరికించే ప్రయత్నం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఖైదీ నంబర్ 150 చిత్రం విడుదల సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఓ ప్రయోగమే చేసింది. నిజానికి, దాన్ని ప్రయోగమనే అనాలి. ఓ స్టార్‌ను మరో స్టార్ ఇంటర్వ్యూ చేయడం.. ఇరువురు కూడా రెండు వేర్వేరు పార్టీలకు చెందినవారు కావడం. వారు రోజా, చిరంజీవి. చిరంజీవిని రోజా చేసిన ఇంటర్వ్యూ ఆద్యంతం లైవ్లీగా సాగింది.

వారిలో ఒకరు ఎమ్మెల్యే కాగా, మరొకరు ఎంపి కూడా. ఇద్దరు కలిసి సినిమాల్లో నటించిన సందర్బాలు కూడా ఉన్నాయి. వాటిని నెమరేసుకుంటూ, ఇతర స్టార్స్ గురించి మాట్లాడుకుంటూ ఈ ఇంటర్వ్యూ సాగింది. అయితే, రోజా ఎక్కడ కూడా సీరియస్ ప్రశ్నలను వేయడం మానలేదు.

రాజకీయాల గురించి కూడా రోజా చిరంజీవిని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గురించి, నాగబాబు గురించి కూడా అడిగారు. సరదాగా మాట్లాడుతూనే రోజా చిరంజీవిని ఇరకాటంలో పెట్టడానికి కూడా ప్రయత్నించారు. అయినా చిరంజీవి ఎక్కడా తడుముకోలేదు. తనకు అత్యంత ఇష్టమైన విషయాల గురించి, ఇబ్బంది కలిగించిన విషయాల గురించి కూడా చిరంజీవి రోజా నుంచి ప్రశ్నలను ఎదుర్కున్నారు.

 ఏడుస్తూ వెళ్లిపోతానన్నావు, కానీ...

ఏడుస్తూ వెళ్లిపోతానన్నావు, కానీ...

చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడానికి ఉపక్రమిస్తూ మన సినిమా పాట షూటింగ్ ఊటీలో జరిగింది, నాకు టెన్షన్ లేకుండా చేశారు అని రోజా అంటే, మీరు తడబడుతావని అనుకున్నా, కానీ ధనాధన్ చేశావు, అది బాగా వచ్చిందని చిరంజీవి మెచ్చుకున్నారు. మామా మామా సాంగ్ షూటింగ్ అప్పుడు ఏడుస్తూ వెళ్లిపోతానన్నావు, కానీ బాగా వచ్చిందని చిరంజీవి రోజాను ఉద్దేశించి అన్నారు. మీరు డైలాగ్స్ చెప్పగానే పట్టేస్తారు, మీ కాన్‌స్ట్రేషన్ అటువంటిది, రోజాకు ఉన్న మెమొరీ ఎవరికీ ఉండదని చిరంజీవి అన్నరు.

 కాజోల్ మీ పక్కన ఎలా చేసింది...

కాజోల్ మీ పక్కన ఎలా చేసింది...

మీతో డ్యాన్స్ చేసేటప్పుడు ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా.. కాజోల్ ఎలా చేసిందని రోజా అడిగితే కాజోల్ మంచి డ్యాన్సర్, తన పక్కన చాలా చిన్నదానిలా కనిపిస్తుందా, తమ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కనిపిస్తుందా అని అనుకున్నాను, కానీ తర్వాత చూస్తే బాగా వచ్చిందనిపించిందని చిరంజీవి చెప్పారు. రత్తాలు. రత్తాలు... మాస్ సాంగ్ బాగుందని, సుందరీ సుందరీ మెలోడీ సాంగ్, అమ్మడూ లెటజ్ కుమ్ముడూ.. పాటలు చాలా బాగా వచ్చాయని చిరంజీవి దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 చరణ్ నాకు పునర్జన్మనిచ్చిన తండ్రి...

చరణ్ నాకు పునర్జన్మనిచ్చిన తండ్రి...

చరణ్‌ను ఎత్తుకుని పెంచారు, అతను నిర్మాతగా మీ సినిమా నిర్మిస్తుంటే ఏమనిపించిందని రోజా అడిగితే తాను చరణ్‌కు జన్మనిచ్చిన తండినైతే, నటుడిగా తనకు పునర్జన్మనిచ్చి తండ్రి చరణ్ అని చిరంజీవి అన్నారు. తన సినిమాను నిర్మించే అవకాశం తాను చరణ్‌కు ఇవ్వలేదని, అతనే పుచ్చుకున్నాడని చెప్పారు. నిర్మాతగా చాలా సపోర్టు చేశాడని చెప్పారు. ధృవ సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు, అయితే అద్భుతమైన టెక్నీషియన్లను ఎన్నుకున్నాడని, దాంతోనే అతని సమర్థత తెలిసి వచ్చిందని, మిగతా పనులు కజిన్ విద్యకు అప్పగించాడని, ఆమె చాలా సమర్థురాలని చిరంజీవి చెప్పారు.

 ఇది మన సామ్రాజ్యం అనిపించింది...

ఇది మన సామ్రాజ్యం అనిపించింది...

రాజకీయంగా ఎంతో ఒత్తిడి ఉండేదని, అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు లైట్స్, సౌండ్స్, కెమెరా అన్నీ చూసేసరికి ఇది మన సామ్రాజ్యం అనిపించిందని చిరంజీవి చెప్పారు. రాజకీయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, రేపు ఏమవుతుందో తెలియదు, ఎవరు ఏ విధమైన విమర్శ చేస్తారో తెలియదు, ఆ విమర్శలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధం కావాల్సి ఉంటుందని చిరంజీవి అన్నారు. రాజకీయం ఒత్తటిడితో కూడిందని, ఖైదీ నంబర్ 150 షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఉల్లాసమనిపించిందని, ఇది మన ఏరియా, ఇది సామ్రాజ్యం అనిపించిందని చిరంజీవి చెప్పారు.

 ఆ థాట్ రాకుండా పోలేదు...

ఆ థాట్ రాకుండా పోలేదు...

రాజకీయంలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడైనా అనిపించిందా అని రోజా అడిగితే, ఎందుకు వచ్చానా అనే థాట్ రాకుండానైతే పోలేదని చిరంజీవి చెబుతూ దానికి వివరణ ఇచ్చారు. ఈ పదేళ్ల కాలంలో రాలేదు గానీ మళ్లీ సినిమా షూటింగ్‌ ప్రారంభించిన తర్వాత అలా అనిపించిందని, ఇంత మిస్సయిపోయామా అని అనిపించిందని అన్నారు. అయితే, ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చే సంతృప్తి ఇంతా అంతా కాదని ఆయన అన్నారు. సిల్క్ స్మితతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీ వద్దకు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చి, రాజకీయాల్లోకి రావాలని మీపై ఒత్తిడి తేవడం నేను చూశాను అని రోజాచెప్పారు. అప్పుడు రాజకీయాల్లోకి రాబోనని మీరు చెప్పారని రోజా గుర్తు చేశారు.

 ఎక్కువగా బాధపడ్డ విషయం ఏమిటంటే...

ఎక్కువగా బాధపడ్డ విషయం ఏమిటంటే...

రాష్ట్ర విభజన సమయంలో సమస్య పరిష్కారానికి తాను సిన్సియర్‌గా పనిచేశానని, జట్టుగా వెళ్తూ వస్తూ సమస్యలుంటాయని చెబుతూ వచ్చామని చిరంజీవి చెబుతూ, తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని, అయితే అలా సాధ్యం కాకపోతే హైదరాబాదును యూటి చేయాలని తాను అడుగుతూ వచ్చానని, అలా చేయించడానికి తాను సిన్సియర్‌గా ప్రయత్నం చేశానని అన్నారు. అలా ప్రయత్నం చేసిన తనను అవకాశవాది అని అన్నారని, ఏం చేశావని అడిగారని ఆయన చెప్పారు. ప్రజల్లో తనను కించపరిచే వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఐదారుగురు తన ఇంటి ముందు గాజులు, చీరెలు పెట్టి అవమానించారని, కాకినాడ వంటి ప్రాంతాల్లో అవమానకరమైన ఫ్లెక్సీలు పెట్టారని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఒక రకమైన నిర్లిప్తతి, నిర్వేదంలాంటిది వచ్చిందని, అయితే బెదరకూడదని అనుకున్నానని చెప్పారు. ఆ సమయంలోనే మనసు కాస్తా నలిగినట్లు అనిపించిందని చిరంజీవి చెప్పారు.

 పవన్ స్టార్ డమ్ గర్వంగా ఉంది...

పవన్ స్టార్ డమ్ గర్వంగా ఉంది...

పవన్ కల్యాణ్ స్టార్‌డమ్‌కు తనకు గర్వంగా ఉందని, తాను ఎగ్జిట్ ఇచ్చాక, పవన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చిరంజీవి చెప్పారు. మెగా ఈవెంట్స్‌కు పవన్ కల్యాణ్ ఎందుకు రావడం లేదని రోజా అడిగితే, మీకు తెలుసు.. మనమంతా ఒక చోట కూర్చుంటే వాడు మరో చోట కూర్చునేవాడు.. భోజనం సమయానికి వచ్చేవాడేమో... అందరితో కలవడు.. అతని ప్రవర్తన కొత్తదేమీ కాదు.. సర్దార్ గబ్బర్ సింగ్ ఫంక్షన్‌కు పిలిస్తే నేను వెళ్లాను... ఇంట్లో కార్యక్రమాలకు వస్తూనే ఉన్నాడు.. అని చిరంజీవి వివరణ ఇచ్చాడు. పవన్ కల్యాణ్‌కు, చరణ్‌కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో కార్యక్రమమేతే వచ్చేవాడినని పవన్ చరణ్‌తో చెప్పినట్లు తెలిపారు. చరణ్ ఈ మద్య పవన్‌ను కలిసి... బాబాయ్ ధృవ సక్సెస్ అయిందని చెప్పాడు. సంబంధాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయని చెప్పారు.

 అతని గురించి మాట్లాడడం వేస్టే

అతని గురించి మాట్లాడడం వేస్టే

నాగబాబుపై నిప్పులు చెరిగిన రాంగోపాల్ వర్మ పవన్‌ను ప్రశంసిస్తున్నాడని రోజా గుర్తు చేయగా వర్మ గురించి మాట్లాడడం వేస్టే అని చిరంజీవి అన్నారు. వర్మది టిపికల్ క్యారెక్టర్, ఒకరిని పొగడాలంటే మరొకరిని తెగుడతాడని అన్నారు. ఆయనతో తాను సినిమా చేయలేదు కాబట్టి ఆయన గురించి తనకు తెలియదని రోజా చెప్పారు. ఒకరిని పొగడాలనుకుంటే పొగడవచ్చు కానీ మరొకరిని తెగడకూడదని చిరంజీవి అన్నారు. తనపై వర్మ చేసిన కామెంట్స్‌ను చిరంజీవి గుర్తు చేశారు. మనిషికి వెటకారం ఎక్కువ అని వర్మ గురించి చిరంజీవి అన్నారు. అతనో మేధావి, దాన్ని పనితనం మీద పెడితే బాగుటుందని చెప్పారు. పవన్ కల్యాణ్‌ను కూడా వర్మ విమర్శించిన సందర్భాలున్నాయని చిరంజీవి చెప్పారు. నాగబాబు తనలా అపుకోలేకపోయాడని ఆయన చెప్పినప్పుడు చిన్నపిల్లాడిలా.. పడీ పడీ నవ్వుతాడని, కోపం వచ్చినా అంతేనని రోజా నాగబాబు గురించి అన్నారు.

 ఎవరంటే ఇష్టం, ఇద్దరని చెప్పకూడదు...

ఎవరంటే ఇష్టం, ఇద్దరని చెప్పకూడదు...

నాగబాబు, పవన్ కల్యాణ్‌ల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఇద్దరిని చెప్పకూడదని రోజా అన్నప్పుడు, నాగబాబు తనతో ఎక్కువగా మాట్లాడుతాడని, నాగబాబుతో మాట్లాడుతుంటే టైమ్ తెలియదని, పవన్ కల్యాణ్ కబుర్లు చెప్పలేడని, అందుకే నాగబాబుతో ఎక్కువగా మాట్లాడుతానని, చాలా విషయాలు చెబుతుంటాడని, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి సైన్స్ విషయాలతో పాటు జబర్దస్తీ గొడవలు కూడా చెబుతుంటాండని అన్నారు. వదిన అంటే పవన్ కల్యాణ్‌కు చాలా ఇష్టమని చిరంజీవి అన్నప్పుడు అమ్మా... అమ్మా.. అంటూ తిరుగుతాడని రోజా గుర్తు చేశారు.

 పూరీ జగన్నాథ్ సినిమా చేస్తా...

పూరీ జగన్నాథ్ సినిమా చేస్తా...

పూరీ జగన్నాథ్‌తో సినిమాను ఆపేసిన విషయాన్ని రోజా గుర్తు చేయగా, ఖైదీ నంబర్ 150 చూసిన తర్వాత, పూరీ చూస్తారనే అనుకుంటున్నాని, నేను ఎలా కనిపించాలనే విషయాన్ని అర్థం చేసుకుని కథలో మార్పులు చేర్పులు చేస్తే తప్పకుండా చేస్తానని చిరంజీవి చెప్పారు.

 మీకు బాగా నచ్చిన సినిమా ఏదీ..

మీకు బాగా నచ్చిన సినిమా ఏదీ..

మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది అని రోజా అడిగే అలా చెప్పడం కష్టమని అంటూనే మాస్, క్లాస్... పిల్లా పెద్దా.. ఆడామగా ఏ తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాలవాళ్లు చూసి, చాలా కాలం పాటు గుర్తుంచుకున్న సినిమా జగదేకవీరుడు, అతిలోక సుందరి అని చెప్పారు. అదో క్లాసిక్ అని అన్నారు. శ్రీదేవి ఎండు చేపల కూర, కొడ్డిగుడ్డు చేసిన విషయం గుర్తుకు వస్తుందని రోజా అన్నారు. శ్రీదేవి అమాయకురాలు, మీరంటే ప్రేమగా ఉండేదని కూడా అన్నారు. ఆమె ఓ ప్యామిలీ మెంబర్‌లా ఉండేదని అన్నారు.

 శ్రీదేవి మానవా.. అని పలికితే..

శ్రీదేవి మానవా.. అని పలికితే..

శ్రీదేవితో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యారని రోజా అడిగితే పక్కన కాంపిటీటీవ్‌గా ఉంటే మన టాలెంట్, స్పిరిట్ పెరుగుతాయని చిరంజీవి అన్నారు. టాలెంటెడ్ ఆర్టిస్టు పక్కన ఉంటే అంతకన్నా బాగా చేయాలని అందుకు సమాయత్తమవుతామని అన్నారు. బాగా చేయాలనే పోటీ తత్వం పెరుగుతుందని, పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. శ్రీదేవి వాయిస్ బాగుంటుందని, మానవా.. అని అన్న తీరు చాలా బాగుందని రోజా అన్నప్పుడు ఆ పాత్ర శ్రీదేవి ఒరిజినల్ క్యారెక్టరైజేషన్‌కు దగ్గరగా ఉంటుందని చిరంజీవి చెప్పారు.

 స్వీట్ వార్నింగ్ ఎవరికి...

స్వీట్ వార్నింగ్ ఎవరికి...

ఖైదీ నంబర్ 150లోని స్వీట్ వార్నింగ్ అనే డైలాగును రోజా తన కోసం ఇంటర్వ్యూలో చిరంజీవితో చెప్పించుకున్నారు. ఆ స్వీట్ వార్నింగ్ ఎవరికి అని ఆమె అడిగితే ఎలా అనుకుంటే అలా అని చిరంజీవి సమాధానం ఇచ్చారు. శంకర్ దాదా చాలా నచ్చిందని చెప్పారు. డైరెక్షన్ చేయగలను గానీ ఆర్టిస్టుగా కంఫర్ట్‌గా ఉన్నప్పుడు కష్టాలు తెచ్చిపెట్టుకోవడం ఎందుకని చిరంజీవి అన్నారు. దర్శకుల్లో ఎవరు ఇష్టమంటే చెప్పడం కష్టమని అన్నారు. ఒక్కళ్లని చెప్పలేనని అంటూ పలువురు దర్శకులను చిరంజీవి ప్రస్తావించారు.

 దుర్మార్గుడు మావాడే...

దుర్మార్గుడు మావాడే...

మీ 151వ సినిమాకు నిర్మాత ఎవరని అడిగితే ఆ దుర్మార్గుడు మావాడే అని చరణ్‌ను ఉద్దేశించి అన్నారు. జానపద సినిమాల కన్నా అలీబాదా, సిందూబాద్ వంటి అడ్వెంచరస్ క్యారెక్టర్స్ చేయాలని ఉన్నట్లు చిరంజీవి చెప్పారు. చరణ్ చేస్తే బాగుంటుందని అన్నారు. ఇద్దరం కలిసి ఓ సినిమా చేస్తామని చెప్పారు. తనతో చేయాలనేది చరణ్ కోరిక అని చెప్పారు ఈ సినిమాలో 30 సెకండ్స్ చేశాడని చెప్పారు.

 వారందరితో కలిసి చేస్తా..

వారందరితో కలిసి చేస్తా..

నాగార్జు, వెంకటేష్ మీకు మంచి మిత్రులు కదా... వారితో కలిసి సినిమాలు చేస్తారా అని అడిగితే, వారితో కలిసి పనిచేయాలని ఉందని, వారికి కూడా ఉత్సాహం ఉందని, మంచి కథ కుదిరితే వారితో చేస్తే చాలా ఉత్సాహంగా ఉంటుందని చిరంజీవి చెప్పారు. చక్‌దే, సుల్తాన్ వంటి సినిమాలు తెలుగులోనూ రావాలని అన్నారు. రీమేక్ అయినా వెంకటేష్ గురుతో స్టార్ట్ చేశాడు, అది కంటిన్యూ అవుతుందనుకుంటా అని చిరంజీవి చెప్పారు.

English summary
Roja's interview with Chiranjeevi during the release of Khadi number 150 film became hot topic in the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu