Don't Miss!
- Finance
ధనిక దేశంలో ఇంధన సంక్షోభం.. గ్యాస్ బిల్లులు చెల్లించేందుకూ అవస్థలు
- News
చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RK Roja: నా కుతురిని కూడా ఇబ్బంది పెట్టారు.. అలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తూ దారుణంగా: రోజా
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ నటిగా ఒక వెలుగు వెలిగిన రోజా అనంతరం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక టెలివిజన్ వరల్డ్ లో కూడా కొన్నాళ్ళు జబర్దస్త్ లో కొనసాగిన రోజా ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం పాలిటిక్స్ లోనే బిజీ అయ్యారు. అయితే రోజా కొన్నిసార్లు తన కూతురు ఇబ్బంది పడిన విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. దారుణంగా ఫొటోలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె చెప్పారు. ఇక అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్
రోజా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. నటిగా సినిమా ఇండస్ట్రీలో జోనసాగుతూనే మరోవైపు రెగ్యులర్ పాలిటిక్స్ లో ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు. ప్రత్యర్ధుల మాటలకు కౌంటర్లు ఇవ్వడంలో రోజా ఫైర్ బ్రాండ్ అని గుర్తింపును అందుకున్నారు. ఇక ఆమె ఇటీవల ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.

ఫ్యామిలీ లైఫ్ ముఖ్యం
రోజా సెల్వమని రాజకియల్లో, సినీ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ లైఫ్ కూడా తనకు చాలా ముఖ్యమైని చెప్పారు. గతంలో అయితే ఎన్నోసార్లు తన పిల్లలకు కూడా వండి పెట్టేంత సమయం దొరకలేదని రాజకీయా పరిస్థితుల వలన ఫ్యామిలీ లైఫ్ కు కొంత దురమయ్యాను అని అన్నారు. అయితే కరోనా లాక్ డౌన్ టైమ్ లో మాత్రం పిల్లలకు వండిపెట్టి వారిని ప్రేమగా చూసుకునే అదృష్టం లభించినట్లు రోజా చెప్పారు.

జబర్దస్త్ షో సెంటిమెంట్
జబర్దస్త్ తో నాకు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉండేది. ఎప్పుడు కూడా ఆ షో నుంచి బయటకు రావాలని అనుకోలేదు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను. నేను ఇప్పటికి మంత్రి అయ్యను అంటే జబర్దస్త్ కారణంగానే అని.. నాకు జబర్దస్త్ షో సెంటిమెంట్ తో సమానం. ఆ షో నుంచి బయటకు రావడానికి ఎవరు కారణం కాదు. నాకు ఇప్పుడు కుదరకపోవడం వలన చేయట్లేదు అంతే.. అని రోజా వివరణ ఇచ్చారు.

మా అమ్మాయి ఫొటోలు మార్ఫింగ్
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు దారుణంగా ట్రోల్స్ వస్తుంటాయి. వాటిని అసలు పట్టించుకోవద్దు. ఆఖరికి నా పిల్లలు కూడా అలా ట్రోల్ చేసే వారి వలన ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మా అమ్మాయి ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేసే వారు. దాని వలన పాప చాలా రోజులు బాధపడింది. ఆ విషయం నాతో చెప్పలేదు. తను చాలా సెన్సిటివ్. మళ్ళీ ఆ విషయంపై వివాదం ఎందుకు అని తను మౌనంగా ఉండిపోయింది. అని రోజా చెప్పరు.

మా అమ్మాయి ఒక మాట చెప్పింది
నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ అన్ని కూడా చూసిన తరువాత మా అమ్మాయి నాతో ఒక మాట చెప్పింది. అమ్మా మనకు ఇవి అవసరమా అని. వారికి ఏమి అర్థం చేసుకోలేని వయసులో ఈ తరహాలో ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఇక వారికి పరిస్థితి గురించి నేను అర్థమయ్యేలా చెప్పేదాన్ని. నేను మాత్రం ఎవరిని ఎప్పుడు కూడా పర్సనల్ గా కామెంట్ చేసిన సందర్భాలు ఉండవు. నేను వర్క్ చేసిన స్టార్స్ అందరూ కూడా నన్ను ఇప్పుడు కలిస్తే ఎంతో ఫ్రెండ్లిగా మాట్లాడతారు. ఎవరు వచ్చినా కూడా నాకు భోజనం పెట్టి పంపించడం అలవాటు.. అని రోజా వివరణ ఇచ్చారు.