»   » రోజులు మారాయ్ సరే కథ మారిందా లేదా..!? బాలకృష్ణ సినిమా పోలికలున్నాయి మరి....

రోజులు మారాయ్ సరే కథ మారిందా లేదా..!? బాలకృష్ణ సినిమా పోలికలున్నాయి మరి....

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ మారుతి దర్శకత్వం తోనే ఆగిపోలేదు. కథలు,స్క్రీన్‌ ప్లేలు రాయడం., సినిమాలు ప్రొడ్యూస్‌ చేయడం.. దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవడం... ఇలా దొరికిన డిపార్ట్మెంట్నల్లా టచ్ చేస్తూ పోయాడు. నాలుగేళ్ళలోనే మారుతి అంటే ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఐతే గత ఏడాదిగా ఈ పార్ట్‌ టైం పనులన్నీ పక్కనబెట్టేసి కేవలం తన డైరక్టోరియల్‌ ప్రాజెక్టుల మీదే ద ష్టిపెట్టిన మారుతి.. ఇప్పుడు మళ్లీ మళ్లీ తన ప్రొడక్షన్లో దిల్ రాజు సహనిర్మాతగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ "రోజులు మారాయి" సినిమా తీశాడు. మురళీ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు...

మొదట్లో అడల్ట్ సినిమాలు తీస్తాడు అనే పేరుతెచ్చుకున్న మారుతి. తాజా సినిమా భలే భలే మగాడివోయ్ తో ఆ ముద్ర పోగుట్టుకున్నాడూ....ఇక విక్టరీ వెంకీ తో "బాబూ బంగారం" కూడా వచ్చేస్తోందీ. మారుతి మారాడూ అనుకుంటే పొరపాటే. లోపల ఒరిజినల్ అలాగే ఉంది...

Rojulu Maaraayi movie looks like Balakrishna

"రోజులు మారాయి ట్రైలర్ చూస్తే అదె విశయం అర్థమౌతోంది దర్శకుడిగా కాకుంటే నిర్మాతగా అయినా ఇలాంటి కథా వస్తువులనీ వదలను అని చెప్పకనే చెప్పాడు మారుతి.

మీకు కాబోయే భర్తలు చనిపోయి మీరు విధవరాళ్లు అవుతారని ఇద్దరమ్మాయిలకు ఓ బాబా చెబితే.. ఇద్దరు బకరా గాళ్లను ముందు భర్తలుగా చేసుకుని వాళ్లను చంపేసి.. ఆ తర్వాత వేరే వాళ్లతో సెటిలవుదామని వాళ్లు ప్లాన్‌ చేసేలా ఉంది "రోజులు మారాయి" కథ చూస్తుంటే.

"దానికి నేను కష్టపడి నా ఆఫీస్ లో ఉద్యోగం వేయిస్తే.. అది ఈజీగా ఎదుటి ఆఫీసోడిక లైనేస్తోంది ఫాదర్" అనే పార్వతీశం డైలాగ్ ను బట్టి హీరోయిన్ క్యారెక్టర్ని ఎలా చూపించారో అర్థమైపోతుంది.

ఇంతకుముందు బాలయ్య హీరోగా నటించిన "మిత్రుడు" సినిమా కథలోనూ ఇలాంటి మొగుడు పోతే మరోకరిని పెళ్ళిచేసుకునే.... కాన్సెప్ట్ తోనే ఉందన్న సంగతి తెలిసిందే. మరి మారుతి తన సినిమాలో ఈ పాయింట్ లో ఏ కొత్తదనం చూపిస్తాడో చూడాలి. కామెడీ, క్రైమ్‌ మిక్స్‌ చేసి సినిమాను తీర్చిదిద్దినట్లుగా ఉంది. జులై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

English summary
Director Maruti's New Movie as a producer "rojulu marayi" story like nandamuri bala krishNa's movie "mitrudu"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu