»   » రోగ్ హీరోయిన్ జీవితం లో నిజమైన రోగ్ : పోలీస్ కంప్లైంట్, అయినా వేదింపులే

రోగ్ హీరోయిన్ జీవితం లో నిజమైన రోగ్ : పోలీస్ కంప్లైంట్, అయినా వేదింపులే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటికే విడుదలైన "రోగ్" సినిమా స్టిల్స్ తో టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆకట్టుకున్న ఏంజెలా, తాజాగా రిలీజ్ చేసిన ఫోటోషూట్ తో ప్రేక్షకులను కూడా తన వైపుకు తిప్పుకుంటోంది. తన భారీ సౌందర్యాలను బహిర్గతం చేస్తూ ఉన్న ఈ ఫోటోలు "రోగ్" సినిమాపై యువతరంలో క్రేజ్ ను పెంచుతున్నాయి. తొలి సినిమాతోనే అటు ఇండస్ట్రీ జనాలను, ఇటు సాధారణ ప్రేక్షకులను బుట్టలో పడేసే విధంగా ఏంజెలా తన ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది.

అయితే ఇదంతా మనం అనుక్లుంటున్న టాక్ మాత్రమే. నిజానికి ఈరోగ్ హీరోయిన్ నిజంగా కూడా ఒక రోగ్ తో వేదింపులు ఎదుర్కుంటోందట. ఏంజెలా ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటోంది. దీనికి కారణం రాహుల్‌ ఖన్నా అనే వ్యక్తి అట. తన గురించి లేని పోని పుకార్లు స్ప్రెడ్‌ చేస్తూ వేధిస్తున్నాడని అతనిపై ఏంజెలా ముంబయిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ చేసింది.

Rouge Heroine engela Files Police Complaint

అక్కడితో ఆగకుండా అతడి గురించి పబ్లిక్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. సదరు రాహుల్‌ ఖన్నా తనని చాలా కాలంగా వేధిస్తున్నాడని, అతని వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని, అతడి వల్ల ఎన్నో రాత్రులు ఏడుస్తూ గడిపానని, కెరియర్‌లో ఎదగడానికి కష్టపడుతూ వుంటే, తన పొట్ట కొట్టడానికి చూస్తున్నాడంటూ ఆక్రోశించింది. అతడు తనని ఎంతగా వేధించాడో అదే స్థాయిలో లీగల్‌గా అతడిని కార్నర్‌ చేస్తానని హెచ్చరించింది. తనని సుఖంగా బతకనివ్వమంటూ అతడిని కోరుతూనే ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఊరుకునేది లేదని తెగేసి చెబుతోంది.

English summary
Rouge Heroine engela files police complaint against A man Named Rahul khanna who trolls abusing her
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu