»   » ఆర్పీ పట్నాయిక్ ఏం కోసుకున్నాడు? పీక, వేలా?

ఆర్పీ పట్నాయిక్ ఏం కోసుకున్నాడు? పీక, వేలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇది ఎలక్షన్ సీజన్. అంతా ఎన్నికలు, ఓట్లు, డబ్బు గురించే మాట్లాడుతూంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలు తమకు నచ్చిన పార్టి కోసం ప్రచారం మొదలెట్టారు. ఇప్పుడు ఆర్పీ పట్నాయిక్ వంతు వచ్చింది. ఆయనకు రాష్ట్రంలో ఏ పార్టీ విధానాలు నచ్చినట్లు లేవు. అందుకే ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఓటేయటమంటే...పీక కోసుకోవటం లేదా వేలు కోసుకోసుకోవటం వంటిది అనేది ఓ పిట్ట కథతో తేల్చి చెప్పాడు. ఇంతకీ హైదరాబాద్ లో ఓటేసిన ఆయన ఏం కోసుకున్నాడు అంటున్నారు.

ఇంతకీ ఆయన చెప్పిన కథేమిటంటే...దేముడు దగ్గరకి ఓ ఓటరు వెళ్లి గురువు గారు ఎవరికి ఓటేయమంటారు అని అడిగాడుట. ఇక్కడున్న రాజకీయ నాయకులందరూ ఎంతో కొంత తినే బాపతే కాబట్టి, ఎవరికి వేసినా ఫర్లేదా అని ఆ భక్తుడు దేవుడుని అడగ్గా అబ్బేలేదు నాయనా అన్నాడట దేముడు. ఒకడు గెలిస్తే నీ వేలు కోసేస్తాడు, ఇంకొకడు గెలిస్తే నీ పీక కోసి చంపేస్తాడు. వేలు కోసుకుంటావా, పీక కోసుకుంటావా అన్నాడు దేముడు. దాంతో ఆ కుర్రాడు స్వామి క్షమించండి, ఎవరికి ఓటేయాలో అర్దమైంది అని పోలింగ్ బూతుకు బయిలుదేరాడట. ఎవరైతే ఎక్కువ డబ్బులతో ఓటుని కొంటారో, వారే పెద్ద అవినీతి పరులు అంటూ సదరు భక్తుడు కమ్ ఓటరు తెలుసుకున్నాడట. ఇది ఆయన చెప్పిన పిట్ట కథ.

Rp Patnaik Story about Voting

ప్రెండ్స్ బుక్ చిత్రం తర్వాత ఆయన దర్శకుడుగా ఏ చిత్రమూ విడుదల కాలేదు. ఆయన మాట్లాడుతూ..మన ఆడియోన్స్ ఐదు పాటలు,ఆరు ఫైట్స్ ఫార్ములా కే హ్యాపీ ఫీలవుతున్నారు. ప్రయోగాత్మకంగా చేసే సినిమాలను వారు తిరస్కరిస్తున్నారు. అంతెందుకు నా ప్రెండ్స్ బుక్ సినిమానే తీసుకోండి. రివ్యూలు సినిమా బాగుందని వచ్చినా...భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రప్పించలేకపోయాయి. టాలీవుడ్ లో నిజమైన మల్టిఫెక్స్ సినిమాలు రావాల్సి ఉంది అన్నారు.

English summary
RP Patnayak write a story about Voting. Two people ready to lead your state with blades on hand, you know both of them with their previous records One is ready to cut your finger the other one is ready to cut your neck.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu