twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న బాబాయి నేడు అబ్బాయి.. 'కొమరం భీమ్' విషయంలో లేటైపోయిన ఎన్టీఆర్!

    |

    జక్కన్న రాజమౌళి గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాల్ని వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు యుక్త వయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. అదృశ్యమైన సమయంలో వీరిద్దరూ ఎలా ఉండేవారు అనేదే ఈ చిత్ర కథ అని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం సినీ అభిమానులంతా కొమరం భీమ్, అల్లూరి చరిత్రలని తిరగేసి పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ పోషించబోతున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన విషయాలని గుర్తు చేసుకుంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

     గొప్ప వీరులు

    గొప్ప వీరులు

    అల్లూరి సీతా రామరాజు, కొమరం భీమ్ ఇద్దరూ సమకాలీకులు. ఇద్దరూ కూడా అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారే. తరచుగా మనం వీరిద్దరి పేర్లు వింటూ ఉంటాం. అల్లూరి సీతారామరాజుగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. కొమరం భీమ్‌పై కూడా చిత్రాలు వచ్చినా అంతగా ప్రాచుర్యం పొందలేదు. మంచి క్రేజ్ ఉన్న నటులెవరూ ఇంతవరకు కొమరం భీమ్‌గా నటించలేదు. తొలిసారి టాలీవుడ్ క్రేజీ హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించబోతుండడం ఆసక్తిరేకెత్తిస్తోంది.

    బాలయ్య ఆల్రెడీ

    బాలయ్య ఆల్రెడీ

    కొమరం భీమ్ పాత్ర విషయంలో ఎన్టీఆర్ కంటే బాలయ్యే ఒకడుగు ముందుగా ఉన్నాడు. బాలయ్య పూర్తిస్థాయిలో కొమరం భీమ్ చిత్రంలో నటించలేదు కానీ చిత్రంలో కొంత సమయం ఆ గెటప్ లో కనిపించాడు. అంటే ఇటీవల కాలంలో కొమరం భీమ్‌గా కనిపించిన ఏకైక హీరో బాలయ్య. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ పాత్రలో నటించనుండడం ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎన్టీఆర్ గెటప్‌ని పోల్చి చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రాజమౌళి కొమరం భీమ్ గురించి లేని పేజీలని కల్పితంగా చూపించబోతున్నాడు.

    నేను అనుకున్నట్లుగా

    నేను అనుకున్నట్లుగా

    గురువారం జరిగిన మీడియా సమావేశంలో కూడా రాజమౌళి ఇదే క్లారిటీ ఇచ్చారు. అల్లూరి సీతా రామరాజు అంటే కాషాయ వస్త్రాలు, ధనుస్సు ధరించి గడ్డంతో కనిపించే లుక్ మనకు తెలుసు. ఇక కొమరం భీమ్ అంటే తలపాగ, పెద్ద మీసాలతో ఉంటారు. వీరిద్దరూ పోరాటం చేసే సమయంలో ఇలా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. కానీ తాను ఆ అంశాలని చూపించడం లేదని, వారిద్దరూ యుక్త వయసులో అదృశ్యమయ్యాక ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎన్టీఆర్, రాంచరణ్‌ని నేను ఊహించుకున్న విధంగా చూపించే అవకాశం ఉందని రాజమౌళి తెలిపారు.

    ఎవరు ఒప్పుకోకున్నా

    ఎవరు ఒప్పుకోకున్నా

    మీడియా అడిగిన మరో ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. ఎన్టీఆర్, చరణ్‌లలో ఎవరు ఒప్పుకోకున్నా ఈ చిత్రం చేసేవాడిని కాదని రాజమౌళి తెలిపారు. అంటే ఆ పాత్రలలో చరణ్, ఎన్టీఆర్‌ని రాజమౌళి ఎంతలా ఊహించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ప్రెస్ మీట్‌తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంపై అంచనాలు పెంచేశారు. 2020 జులై 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు నిర్మాత దానయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    RRR: Balakrishna already played Komaram Bheem role in Parama Veera Chakra
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X