»   » హాట్రిక్: క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతున్న రాజ్‌త‌రుణ్ అంధ‌గాడు

హాట్రిక్: క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతున్న రాజ్‌త‌రుణ్ అంధ‌గాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజ్‌త‌రుణ్ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ అంధ‌గాడు. గ‌తంలో ఈ కాంబోలో ఆడోర‌కం-ఈడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త సినిమాలు సూప‌ర్‌హిట్ అయ్యాయి. అంధ‌గాడుతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. అలాగే హిట్‌పెయిర్ రాజ్‌ర‌తుణ్‌, హెబ్బా ప‌టేల్‌కు కూడా హ్యాట్రిక్ మూవీగా నిలిచింది అంద‌గాడు.

సినిమా ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా విడుద‌లైన మొదటి ఆట నుండే బాక్సాఫీసు వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది. తొలిరోజు 3.75 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన అంధ‌గాడు రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే హయ్య‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.


వర్మ ప్రశంసలు

వర్మ ప్రశంసలు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా అంధ‌గాడు చిత్రాన్ని చూసి అందులో రాజ్‌త‌రుణ్ న‌ట‌న‌ను, సినిమాలో ట్విస్టులు ఎంతో బావున్నాయ‌ని అప్రిషియేట్ చేశారు.


వెలిగొండ శ్రీనివాస్

వెలిగొండ శ్రీనివాస్

ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. సినిమాలో కామెడి, సెంటిమెంట్‌, ఎమోష‌న్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేజ‌ర్ హైలెట్‌గా రూపొందిన ఈ చిత్రం సాధిస్తున్న క‌లెక్ష‌న్స్ చూస్తుంటే డెఫ‌నెట్‌గా `అంధ‌గాడు` చిత్రం రాజ్‌త‌రుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌హిట్‌గా నిలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.


రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు.. బోర్ కొడుతున్నాడు.. అతడితో సినిమాలు చేయను.. హెబ్బా పటేల్

రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు.. బోర్ కొడుతున్నాడు.. అతడితో సినిమాలు చేయను.. హెబ్బా పటేల్

రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు.. బోర్ కొడుతున్నాడు.. అతడితో సినిమాలు చేయను.. హెబ్బా పటేల్ ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి.


ఆ బంధం హార్ట్‌కు సంబంధించిన రిలేషనే.. డైరెక్షన్ చేయాలని ఉంది.. రాజ్ తరుణ్

ఆ బంధం హార్ట్‌కు సంబంధించిన రిలేషనే.. డైరెక్షన్ చేయాలని ఉంది.. రాజ్ తరుణ్

ఆ బంధం హార్ట్‌కు సంబంధించిన రిలేషనే.. డైరెక్షన్ చేయాలని ఉంది.. రాజ్ తరుణ్ చెప్పిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
'ANDHHAGADU' is off to a flying start. The film has raked in Rs.3.75 crores on day 1, which is the biggest opening ever in the career of Raj Tarun. The film received extremely positive reports from the premieres held across Andhra Pradesh, Telangana and the positive word of mouth helped the film register huge openings on day 1.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu