»   » కథా చౌర్యం : 'భజరంగీ భాయ్‌ జాన్‌' పై 50 కోట్ల కాపీ రైట్ కేసు

కథా చౌర్యం : 'భజరంగీ భాయ్‌ జాన్‌' పై 50 కోట్ల కాపీ రైట్ కేసు

Written By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన చిత్రం 'భజరంగీ భాయ్‌ జాన్‌'. రంజాన్‌ సందర్భంగా విడుదల ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రచయిత విజియేంద్రప్రసాద్ స్టార్ రైటర్ గా బాలీవుడ్ లోనూ పాగా వేసారు. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఈ చిత్రంపై కాపీ రైట్ కేసు పడింది. యాభై కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ముంబై కు చెందిన కోర్టులో కేసు వేసారు ఓ టీవీ ప్రొడ్యూసర్.

BAJARANGI

వివరాల్లోకి వెళితే... ముంబై హైకోర్టులో డైరక్టర్ మరియు టీవి ప్రొడ్యూసర్ అయిన మహిమ్ జోషి తనదే ఈ కథ అని, తన కథని చౌర్యం చేయటం వల్ల తన కెరీర్ డ్యామేజ్ అయ్యిందని, తనును తాను ఇండస్ట్రీలో లాంచ్ చేసుకునేందుకు రాసుకున్న స్క్రిప్టు అదని కేసు వేసారు. స్క్రీన్ ప్లే నుంచి లొకేషన్స్ వరకూ అంతా తన స్క్రిప్టునే పోలి ఉందని ఆయన కేసు వేసారు. ఈ మేరకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ను కోర్టుకు సమర్పించారు. డిటేల్డ్ గా తన స్క్రిప్టులోని సీన్స్ కు, సల్మాన్ సినిమాలోని సీన్స్ కు సీక్వెన్స్ కు ఉన్న పోలిక లు చెపుతూ ఆయన ఈ కేసుని ఫైల్ చేసారు. జూలై 2007 లో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసానని ఆయన ఆధారాలు చూపెడుతున్నాడు.

BAJARNGI 2

ఇక ఈ చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు సైతం ఇచ్చింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటి నుండీ ఇది చిరంజీవి సూపర్ హిట్ చిత్రం పసివాడి ప్రాణం కథ నుంచి ప్రేరణ పొందింది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రిలీజై అంతటా అదే జోరుగా వినిపిస్తోంది. ఈ విషయమై ఈ చిత్రం కథ రచయిత విజియేంద్రప్రసాద్ సైతం నిజమైనన్నట్లు సమాచారం.

విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ...చిరంజీవి 1987లో నటించిన పసివాడి ప్రాణం చిత్రం నన్ను అప్పట్లో బాగా కదిలించింది. దాన్ని పూర్తి మార్పులతో కాంటెంపరెరీ టచ్ ఇచ్చి చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ లోగా తాను ఓ పాకిస్దానీ జంట...తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం ఇండియాకు వచ్చినట్లు..అక్కడ ఖర్చు భరించలేక ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నట్లు మీడియాలో వార్త రావటం గమనించానని..కథని సిద్దం చేసానని అన్నారు. పసివాడి ప్రాణం సినిమాలో మూగ అబ్బాయి చుట్టూ కథ తిరిగితే..ఇక్కడ మూగ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది.

English summary
Salman Khan - Kareena Kapoor starrer Bajrangi Bhaijaan that released on Eid seems to have run into trouble. In fact the makers of the film which created waves at the box office are facing a Rs. 50 crore copyright infringement law suit that claims the entire plot line and some locations were blatantly inspired from another script.
Please Wait while comments are loading...