»   »  హాట్ టాపిక్: గబ్బర్‌సింగ్-2 డీల్ రూ. 72 కోట్లు!

హాట్ టాపిక్: గబ్బర్‌సింగ్-2 డీల్ రూ. 72 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏమిటో మరోసారి రుజువైంది. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘గబ్బర్ సింగ్ -2' షూటింగ్ దశలోనే భారీ ఢీల్ కుదిరింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని రూ. 72 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్నింటిని ఇంత భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈరోస్ సంస్థ 72 కోట్లు వెచ్చించిందంటే...ఈ చిత్రం బిజినెస్ 100 నుండి 120 కోట్లు దాటించే ప్రతయ్నంలో ఆ సంస్థ ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో చూడాలి.

Rs.72 Cr Deal for 'Gabbar Singh 2'

‘గబ్బర్ సింగ్-2' చిత్రం షూటింగ్ మే 29 మహారాష్ట్రలోని మల్షెజ్ ఘాట్స్ ప్రాంతంలో ప్రారంభించారు. జూన్ 5తో తొలి షెడ్యూల్ పూర్తయింది కూడా. అయితే షూటింగులో ఇంకా పవన్ కళ్యాణ్ జాయిన్ కాలేదు. రెండో షెడ్యూల్ ను జూలై మొదటి వారంలో ఆరంభిస్తారని, ఆ షూటింగులో పవన్ కళ్యాన్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ 2 ఫ్లాస్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

English summary
Power Star Pawan Kalyan has once again proved his stamina with his new movie 'Gabbar Singh 2'. According to the trade reports, the movie was sold out to top Bollywood's production house EROS International for Rs.72 crores deal which includes all rights like theatricals, satellite, audio and dubbing rights.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu