»   » కుంటాల వాటర్ ఫాల్స్ వద్ద ‘రుద్రమదేవి’ షూటింగ్

కుంటాల వాటర్ ఫాల్స్ వద్ద ‘రుద్రమదేవి’ షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన న్యూ షెడ్యూల్ మొదలైంది. త్వరలో కొన్ని సన్నివేశాలను అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం వద్ద చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మేరకు కుంటాల జలపాతం సమీపంలో సెట్ వేసారు. గ్రాఫిక్స్ ఉపయోగించి సినిమాలో ఈ సెట్‌ను మరింత అద్భుతంగా చూపించబోతున్నట్లు సమాచారం. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన వీరనారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Rudhramadevi

భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మార్చి నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, కుమార్తె మేథ బాలనటులుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 14 ఏళ్ల ప్రాయంలో ఉన్న చాళుక్య వీరభద్రుడి పాత్రలో చిన్ననాటి రానాగా నటిస్తుండగా, శ్రీకాంత్ కూతురు మేథ 9 ఏళ్ల ప్రాయంలో ఉన్న రుద్రమదేవిగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

English summary
Anushka’s upcoming period film Rudhramadevi will soon be shot in Adilabad district. The film unit will soon can some major sequences near Kuntala waterfalls, in Adilabad district.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu