3డిలో అనుష్క ‘రుద్రమ దేవి’(అఫీషియల్ న్యూస్)
ఈ చిత్రాన్ని 3డి టెక్నాలజీతో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరుస ప్లాపులతో ఉన్న గుణశేఖర్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందకు రావక పోవడంతో తానే స్వయంగా ఈచిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నాడు గుణశేఖర్. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇళయరాజా సంగీతం అందించనున్నారు.
మీడియా సమావేశంలో ఈ చిత్రం గురించి దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ...ఈచిత్రం భారత దేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి సినిమా అని, ఇందుకోసం కాకతీయుల కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక సెట్ వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈచిత్రం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ చిత్ర స్క్రిప్ట్ కోసం దాదాపు పదేళ్లుగా గుణశేఖర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. సాంకేతికంగా అత్యున్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 12వ శతాబ్ధంలోని కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో చారిత్రాత్మక చిత్రంగా దీన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో 'రుద్రమదేవి'గా అనుష్క టైటిల్ పాత్ర చేయనుంది.


Click it and Unblock the Notifications












