»   »  ‘రుద్రమదేవి’ ప్రచార రథం సిద్దమైంది (ఫోటోస్)

‘రుద్రమదేవి’ ప్రచార రథం సిద్దమైంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘రుద్రమదేవి' సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు వారు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని అంటున్న దర్శకుడు సినిమా విడుదల ముందు భారీగా ప్రమోషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం ‘రుద్దమ్మరథం' పేరుతో ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేసారు. ఈ రుద్దమ్మ రథంలో సినిమా యూనిట్ రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలు తిరుగుతూ సినిమా ప్రచారం కల్పించబోతున్నారు. త్వరలోనే ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించనున్నారు.


 గతంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో.. రుద్రమదేవి సినిమా తెలుగు వారు

గతంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో.. రుద్రమదేవి సినిమా తెలుగు వారు

గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. గుణశేఖర్ అంటే భారీ సెట్లు వేస్తాడనే అపోహ ఉంది. కానీ రుద్రమదేవి విషయంలో కథే ముఖ్యమైంది. కథకు అనుగుణంగానే సెట్స్ వేసాను. రుద్రమదేవి క్యారెక్టర్ కు అనుష్క అయితేనే న్యాయం చేస్తుందని అందరూ అన్నారు. అలా ప్రజలే అనుష్కను రుద్రమ దేవిగా నిర్ణయించారు. అనుష్క ఈ సినిమా కోసం చాలా కష్టపడింది అన్నారు.


అల్లు అర్జున్‌‌కి వరుడు సినిమా టైంలో ఈ సినిమా గురించి చెప్పాను.

అల్లు అర్జున్‌‌కి వరుడు సినిమా టైంలో ఈ సినిమా గురించి చెప్పాను.

గోనగన్నారెడ్డి పాత్ర చేయమని అడగ్గానే ఆనందంగా ఒప్పుకున్నాడు. 35 రోజులు పాటు ట్రైనింగ్ తీసుకుని 35 రోజులు షూటింగులో పాల్గొన్నాడు. సినిమా కోసం తోట తరణి అద్భుతమైన సెట్స్ వేసారు. ఇళయరాజా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. లండన్‌లో రీ రికార్డింగ్ చేసామని గుణశేఖర్ తెలిపారు.


ప్రస్తుతం సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్

ప్రస్తుతం సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్

తెలిపారు.. ఇండియాలోనే ఇది తొలి 3డి స్టీరియోస్కోపిక్ హిస్టారికల్ మూవీ. సినిమాను 3డితో పాటు 2డిలో కూడా విడుదల చేస్తున్నాం. కెమెరామెన్ 2డి సినిమాను కూడా 3డి అనుభూతి వచ్చేలా షూట్ చేసారు. సెప్టెంబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నాం. త్వరలోనే ఆడియో విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు గుణ శేఖర్.


అనుష్క ఈ సినిమా గురించి చెబుతూ... 13, 14 శతాబ్దాల కాలంలో ఉంటే

అనుష్క ఈ సినిమా గురించి చెబుతూ... 13, 14 శతాబ్దాల కాలంలో ఉంటే

ఎలా ఉంటుందో ఈ చిత్రం కళ్లకుకట్టినట్లు ఉంటుందని తెలిపారు. నా కెరీర్లో ఇది గొప్ప చిత్రం అవుతుంది. ఈ క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, కేథరిన్ తెరిస్సా, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'


English summary
'Rudhramma Radham' would be coming to your town very soon!
Please Wait while comments are loading...