twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ పోటీ పుకారా?

    By Staff
    |

    Pawan Kalyan
    కడపలో జగన్ పై పోటీకి పవన్ కల్యాణ్? అన్ని చోట్లా వచ్చిన న్యూస్ పుకారా అన్న సందేహం ఇప్పుడు అంతటా వ్యక్తమవుతోంది. పత్రికలు వారు వండిన మశాలా న్యూస్ గా కొందరు దీన్ని కొట్టిపడేస్తున్నారు. అటు కాంగ్రేస్ లోగాని,ఇటు ప్రజా రాజ్యంలో గాని ఈ న్యూస్ పై చర్చ జరగక పోవటం,గుసగుసల స్ధాయిలోనే ఆగిపోవటం అందరకి ఈ టాపిక్ పై అనుమానాలకు కారణమవుతోంది.

    ఐతే కొందరు మాత్రం కడప లోక్ సభ స్ధానం నుంచి ఈ సారి వైఎస్‌ కుమారుడు జగన్మోహన్‌రెడ్డి పోటీ ఖాయమైంది కదా. జగన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా పవన్‌ కల్యాణ్‌ అయితేనే సరిపోతాడని ఆ న్యుస్ వండిదినది అయినా కరెక్టే అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

    అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా, రాష్ట్రమంతటా పార్టీ తరఫున ప్రచారం మాత్రమే చేయాలని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. అయితే కడప జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ కాంగ్రెస్‌ను గట్టిగా ఎదుర్కోవాలంటే కడపలో పవన్‌ పోటీ చేయడమే మార్గమని పీఆర్‌పీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

    పవన్‌ పోటీ వల్ల కడప జిల్లాలో నేతలు, కార్యకర్తల ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు రాయలసీమ అంతటా కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తుందనేది పీఆర్‌పీ వ్యూహంగా చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం కడప లోక్‌సభ పరిధిలోనే ఉంది. పవన్‌ను కడప నుంచి బరిలోకి దించడం ద్వారా జగన్‌ను, కొంతమేర వైఎస్‌ను కడప జిల్లాకే పరిమితం చేయాలన్నది పీఆర్‌పీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఈ విషయమై పీఆర్‌పీలో ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పవన్ మాత్రం ఈ విషయమై ఏమీ స్పందించలేదని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X