»   » త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి ఎస్.గోపాలరెడ్డి కెమెరా...

త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి ఎస్.గోపాలరెడ్డి కెమెరా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్ రెడ్డి కెమెరామెన్ గా చేయనున్నారు. త్రివిక్రమ్ తొలిసారిగా గోపాలరెడ్డితో పనిచేయనున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం యూనవర్శిల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం హీరోయిన్ జరుగుతోంది. అనూష్క,సమంత పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే అప్పుడు రైటర్ గా త్రివిక్రమ్ ఆ చిత్రాలకు పనిచేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడుగా, వెంకటేష్ తో చిత్రం ఓకే చేయించుకున్నారు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన సబ్జెక్టు ఫైనల్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఖలేజా విడుదలై భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మరో ప్రక్క వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి తో డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ఉన్నారు. ఇక నిర్మాత దానయ్య ఈ చిత్రానికి ముందు అల్లు అర్జున్ తో చేసిన వరుడు చిత్రం పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

English summary
Director Trivikram has chosen music director Veteran cameraman S Gopal Reddy for his next film with Venkatesh as hero. Danayya is producing this film which will go to the sets next month. Although heroine has not yet been finalized, a young heroine who acted in couple of movies is in the race for it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu