Just In
- 22 min ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 37 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- Finance
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
- News
శకటాల పరేడ్ వర్సెస్ ట్రాక్టర్ల నిరసన ప్రదర్శన: గణతంత్ర చరిత్రలో తొలిసారిగా: అసలు నిర్వచనం
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘S/O సత్యమూర్తి’ కథ లీక్, ఇదేనా?
హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న ‘S/O సత్యమూర్తి' కథ అంటూ ఒక చిన్న స్టోరీ లైన్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది...... ఆ ప్రచారం ప్రకారం ‘సత్యమూర్తికి వెన్నెల కిషోర్ మరియు అల్లు అర్జున్‌లు ఇద్దరు కొడుకులు. మిలియనీర్ అయిన సత్యమూర్తి తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశ విదేశాలకు విస్తరిస్తాడు. తండ్రి మిలియనీర్ అవ్వడంతో అల్లు అర్జున్ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతుకుతూ ఉంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల సత్యమూర్తి వ్యాపారంలో లాస్ వచ్చి, సత్యమూర్తి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చనిపోతాడు. తండ్రి చనిపోవడంతో వెన్నెల కిషోర్ పిచ్చి వాడు అవుతాడు. సత్యమూర్తి చనిపోయే ముందు కొడుకులతో ఓ రహస్యం చెబుతాడు. దాంతో రాయలసీమకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బన్నీ అత్త ఉంటుందని అంటున్నారు. అత్త కోసం అక్కడ బన్నీ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి....సినిమాలో ముగ్గురు హీరోయిన్ల కథేంటి? స్నేహ, ఉపేంద్ర పాత్ర ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుందని' అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

సినిమాకు సంబంధించిన ఇతర విషయాల్లోకి వెళితే...
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న కానీ, అల్లు అర్జున్ పుట్టిన రోజైన 8న కానీ విడుదలయ్యే అవకాసం ఉంది. అల్లు అర్జున్ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.