»   » అనుష్కకు చేదు అనుభవం.. సాహో నుంచి అవుట్.. షాక్‌లో ప్రభాస్

అనుష్కకు చేదు అనుభవం.. సాహో నుంచి అవుట్.. షాక్‌లో ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో ఓవర్‌ నైట్‌లో ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతాయంటే ఏమో అనుకొన్నాం. ప్రస్తుతం అనుష్క పరిస్థితి చూస్తే మాత్రం సరిగ్గా అర్థం అవుతుంది. సాహో చిత్రం నుంచి ఆమెను తొలగించడం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఆమెను తొలగించడంతో సాహో చిత్రంలో హీరోయిన్ ఎంపిక మళ్లీ మొదటికివచ్చింది. అనుష్కను సినిమా నుంచి తొలగించాల్సి రావడాన్ని యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ జీర్ణించుకోలేకపోతున్నారట. సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుష్కను తొలగించడం సెన్సేషన్‌గా మారింది.

ఊగిసలాట మధ్య అనుష్క ఎంపిక

ఊగిసలాట మధ్య అనుష్క ఎంపిక

అరుంధతి, బాహుబలి లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన మెప్పించిన అనుష్క‌కు సాహో రూపంలో చేదు అనుభవం ఎదురైనట్టు సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం యూవీ క్రియేషన్ నిర్వాహకులు బాలీవుడ్ అంతా వెతికారు. కానీ చివరికి అనుష్కను సంప్రదించడంతో తన నిర్ణయాన్ని చెప్పడానికి ఆమె చాలా సమయాన్ని తీసుకొన్నది. చివరికి ఆమె ఓకే చెప్పడంతో సాహో హీరోయిన్ ఎంపిక పూర్తయిందని అంతా ఊపిరి పీల్చారు.

Anushka to Romance Chiranjeevi in Uyyalawada Narasimha Reddy
అర్ధరాత్రి అనూహ్యంగా తొలగింపు

అర్ధరాత్రి అనూహ్యంగా తొలగింపు

కానీ అనుహ్యంగా అనుష్కను తొలగించారనే విషయం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అనుష్క తొలగింపుపై జాతీయ స్థాయి పత్రిక ఒకటి తన కథనంలో పేర్కొన్నది. ఆ వెబ్‌సైట్ తెలిపిన ప్రకారం సాహో కోసం అనుష్కకు శిక్షణ ఇవ్వడం కష్టంగా మారింది. ఆమె ఎక్కువ బరువు పెరుగడం వల్ల పాత్రకు సరిపోదని అనిపించింది. అనుష్క ప్రస్తుతం ఐదు నుంచి 8 కిలోల బరువు ఎక్కువగా ఉంది. లావెక్కడం కారణంగానే ఆమె పాత్రను వదులుకోవాల్సి వచ్చింది అని వెల్లడించింది.

అనుష్కపై సైజ్ జీరో ప్రభావం

అనుష్కపై సైజ్ జీరో ప్రభావం

అనుష్క ఆరోగ్యంపై సైజ్ జీరో చిత్ర ప్రభావం భారీగానే పడినట్టు స్పష్టమవుతున్నది. సైజ్ జీరో చిత్రంలో ఎక్కువ లావు ఉన్న మహిళ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బాహుబలి1, బాహుబలి2 సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఆ పాత్ర కోసం ఆమె చాలా బరువు పెరిగింది. ఆ తర్వాత వేగంగా అంత బరువును తగ్గించుకొన్నది. కానీ నాజుకుగా ఉండటం ఆమెకు సాధ్యపడలేదు.

బాహుబలి2 సమయంలో కూడా అతి లావుగా

బాహుబలి2 సమయంలో కూడా అతి లావుగా

బాహుబలి2 సినిమా ప్రమోషన్‌లో కూడా అనుష్క బరువు పెరగడం తెలిసిందే. అప్పడే చాలా మంది ఆమె బాడీపై తగిన శ్రద్ధ తీసుకోవడం లేదా అనే ప్రశ్నలు లేవనెత్తారు. బాహుబలి తర్వాత ఆమె పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు కూడా జోరందుకున్నాయి. అందుకనే ఆమె శరీర బరువుపై అంతగా దృష్టిపెట్టడం లేదా అని అనుకొన్నారు.

మళ్లీ మొదలైన హీరోయిన్ వేట

మళ్లీ మొదలైన హీరోయిన్ వేట

తాజాగా బరువు కారణంగా సాహో నుంచి అనుష్కను తప్పించే విషయంపై యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. కానీ త్వరలోనే మరో హీరోయిన్ పేరును ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తున్నది. గతంలో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించడానికి కత్రినా కైఫ్, దిశా పటానీ, సోనమ్ కపూర్, శ్రద్ధాకపూర్, పూజా హెగ్డేను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అనుష్క తర్వాత కొత్త హీరోయిన్ ఎవరనే ఆసక్తి అభిమానుల్లోపెరుగుతున్నది.

అలాంటి వార్తలు రాస్తే చర్యలు

అలాంటి వార్తలు రాస్తే చర్యలు

కాగా బాహుబలి2 రిలీజ్ తర్వాత అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబుతున్నారనే గాసిప్స్ విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఓ దశలో మనస్తాపానికి గురైన అనుష్క తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలను ఆధారాలు లేకుండా రాస్తే కేసు పెడుతానని, చట్టపరంగా చర్యలు తీసుకొంటానని ఆమె హెచ్చరించిన విషయం తెలిసిందే.

English summary
Anushka Shetty is no longer part of Baahubali star Prabhas's forthcoming outing Saaho. Report says that "Anushka was training hard for the role in Saaho. But her weight has become a bone of contention. She is still about five to eight kilo overweight. And this might cost her the film itself."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more