»   » ప్రభాస్ ఆ ఇద్దరు హీరోయిన్లను పక్కనపెట్టాడు.. ఇక ఆమెతోనేనా?

ప్రభాస్ ఆ ఇద్దరు హీరోయిన్లను పక్కనపెట్టాడు.. ఇక ఆమెతోనేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 సంచలన విజయం తర్వాత హీరో ప్రభాస్ వెనుక బాలీవుడ్ పడుతున్నదనేది ఓపెన్ సీక్రెట్. బాహుబలి కోసం దాదాపు ఐదేళ్ళు అంకితమైన ప్రభాస్ తదుపరి చిత్రంగా సుజిత్ రెడ్డి దర్శకత్వంలో సాహో అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా హైరేంజ్ యాక్షన్ సినిమా కావడం గమనార్హం. ప్రతిష్థాత్మకంగా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఈ సినిమా కోసం శ్రద్ధాకపూర్, దిశాపటానీ పక్కన పెట్టినట్టు సమాచారం.

పరిశీలనలో శ్రద్ధా, దిశాపటానీ..

పరిశీలనలో శ్రద్ధా, దిశాపటానీ..

సాహో చిత్రం కోసం సంప్రదించిన హీరోయిన్లలో శ్రద్ధాకపూర్, దిశా పటానీ ఉన్నారు. కానీ వారిద్దరూ ఊహించని విధంగా రెమ్యూనరేషన్ అడగడంతో వారిని తీసుకోకూడదని అనుకొన్నారనేది తాజా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం సాహోలో నటించేందుకు శ్రద్ధాకపూర్ రూ.8 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది.

అంత డిమాండ్ చేయడంతో..

అంత డిమాండ్ చేయడంతో..

సాహో చిత్రం కోసం ప్రభాస్ పక్కన శ్రద్ధాకపూర్‌ను తీసుకోవాలనే మా మొదటి ఛాయిస్. ఆమె కథ కూడా చెప్పాం. కథ వినేటప్పుడు ఎక్సైటింగ్ ఆపుకోలేక ఎగిరి గంతేసింది. అయితే చిత్రంలో నటించేందుకు రూ.8 కోట్లు డిమాండ్ చేసింది. దాంతో మేము షాక్ తిన్నాం. టాలీవుడ్‌లో ఏ నటికి కూడా అంత చెల్లించిన దాఖలాలు లేవు అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

రెమ్యూనరేషన్ విషయంలో నో క్వశ్చన్..

రెమ్యూనరేషన్ విషయంలో నో క్వశ్చన్..

కథ నచ్చింది. ఈ చిత్రం చేయడానికి చాలా ఆసక్తితో ఉన్నాను. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో నటించడానికి చాలా ఉత్సాహంతో ఉన్నాను. కానీ రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం మార్పు ఉండదని శ్రద్ధాకపూర్ చెప్పింది అని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.

దిశ డిమాండ్‌కు అవాక్కు..

దిశ డిమాండ్‌కు అవాక్కు..

ఇక బాలీవుడ్ హాట్ ఫిగర్ దిశాపటానీది మరో కథ. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కన ఈ అందాల ముద్దుగుమ్మ నటించింది. సాహో చిత్రంలో నటించడానికి ఓకే అని చెప్పిందట. కానీ ఈ గ్లామర్ బ్యూటీ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ విని నిర్మాతలు అవాక్కయారనేది తాజా సమాచారం. ప్రభాస్ పక్కన నటించడానికి దిశాపటానీ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఆమెకు అంత సీన్ లేదనే ఉద్దేశంతో దిశాను కూడా పక్కనపెట్టినట్టు సమాచారం.

అంతా ఇస్తున్నారా?

అంతా ఇస్తున్నారా?

దిశాపటానీ తెలుగు సినిమాతోనే కెరీర్ ప్రారంభించడంతో ఆమె ఈ చిత్రంలో నటిస్తుందనే ఆసక్తితో మేము ఆమెను సంప్రదించాం. అయితే దిశా మాతో మాట్లాడలేదు. కానీ ఆమె సిబ్బంది మాతో మాట్లాడారు. దిశా స్క్రిప్ట్ నచ్చిందని చెప్పింి. కానీ రెమ్యూనరేషన్ రూ.5 కోట్లు అడిగింది. దాంతో మేమే షాక్ తిన్నాం. బాలీవుడ్‌లో ఎవరైనా ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా? అని చిత్ర యూనిట్ ప్రశ్నించింది.

కత్రినా కైఫ్ గ్రీన్ సిగ్నల్..

కత్రినా కైఫ్ గ్రీన్ సిగ్నల్..

సాహో చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్ల వేట కొనసాగుతున్నది. తాజాగా కత్రినా కైఫ్ ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తితో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. కత్రినా డేట్స్ కూడా అడ్జస్ట్ కావడంతో ఆమెను తీసుకోవాలని అనుకొంటున్నట్టు వార్తలు వెలువడతున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడితే గానీ అసలు విషయం తెలియదు.

English summary
Bollywood actors Shraddha Kapoor and Disha Patani were offered to play the leading lady's role in Prabhas's Saaho. However, the makers dropped both the actors when they demanded huge remuneration for the film. Shraddha Kapoor demanded Rs 8 crore, Disha, asked Rs 5 crore to work in Saaho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu