»   » సాహో : అబుదాబిలో ఒళ్లు గగుర్బొడిచే సీన్లు, ఇండియా నుండి 300 మంది టీం!

సాహో : అబుదాబిలో ఒళ్లు గగుర్బొడిచే సీన్లు, ఇండియా నుండి 300 మంది టీం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాబు సిరిల్... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలి సినిమా కోసం ఆయన వేసిన భారీ సెట్టింగులు చూసి ప్రేక్షక లోకం ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం సాబు సిరిల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' సినిమాకు పని చేస్తున్నారు. ఓ ప్రముఖ మేగజైన్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం అబుదాబిలో భారీ సెట్ వేస్తున్నట్లు వెల్లడించారు.

గత నెలన్నర రోజలుగా.....

గత నెలన్నర రోజలుగా.....

‘సాహో' సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఏప్రిల్ 12 నుండి అబుదాబిలో షూట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన సెట్స్ కోసం సాబు సిరిల్ అండ్ టీమ్ గత నెలన్నర రోజులుగా అక్కడ పని చేస్తున్నారట. ఈ విషయాన్ని సాబు సిరిల్ స్వయంగా వెల్లడించారు.
ఆరు నెలలుగా కసరత్తు

ఆరు నెలలుగా కసరత్తు

అబుదాబిలో ఎక్కడ షూట్ చేయాలి, ఎలాంటి సెట్టింగుల వేయాలి అనే దానిపై గత ఆరు నెలలుగా సాబు అండ్ టీమ్ అబుదాబిలో వివిధ ప్రాంతాలు పర్యటించారు. గత ఆరు నెలలుగా ఆయన 8 సార్లు అబుదాబి వెళ్లి వచ్చారట.


300 మంది టీంతో సాబు

300 మంది టీంతో సాబు

అబుదాబిలో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన సెట్స్ వేయడం కోసం 300 మంది టీంతో సాబు సిరిల్ నెలన్నర క్రితం అబుదాబి వెళ్లారు. ఇందులో పేయింటర్లు, మౌల్డర్స్, కార్పెంటర్స్, వెల్డర్స్, డిజైనర్స్ తదితరులు ఉన్నారు.


4 కంటైనర్లలో సామాగ్రి తరలింపు

4 కంటైనర్లలో సామాగ్రి తరలింపు

సెట్స్ వేయడానికి కావాల్సిన సామాగ్రిని 4 కంటైనర్లలో షిప్స్ ద్వారా ఇండియా నుండి అబుదాబి తరలించారు. ప్రస్తుతం అక్కడ సెట్స్ వేస్తూ టీం మొత్తం బిజీ బిజీగా గడుపుతోంది. ఏప్రిల్ 12 వరకు వీరి పని పూర్తవుతుందని, ఆ తర్వాత సాహో చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది.


 ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లు

ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లు

సాహోలో సుమారు 20 నిమిషాల పాటు ఒళ్లు గగుర్బొడిచే సీక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆ స్టంట్ సీక్వెన్స్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. బైక్‌లు, కార్లు, ట్రక్కులతో ఆ ఛేజింగ్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం.
 రూ. 40 కోట్లు కేవలం ఈ సీన్ల కోసమే

రూ. 40 కోట్లు కేవలం ఈ సీన్ల కోసమే

ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని, అందుకోసం ఏకంగా 40 కోట్ల భారీ బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మొదట ఇంత ఖర్చు ఎలా? అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ సాబు సిరిల్ చెప్పిన విషయాలు విన్న తర్వాత ఎందుకు ఇంత ఖర్చు అవుతుందో అర్థం చేసుకోవచ్చు.
150 కోట్ల భారీ బడ్జెట్

150 కోట్ల భారీ బడ్జెట్

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో' చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
English summary
“I flew down here nearly one-and-half months ago with my entire art team of 300 painters, moulders, carpenters, welders and designers. A lot of research into materials and set design work was undertaken by my team in advance in Hyderabad last year, in preparation for this shoot. All of that material has now been shipped from India to Abu Dhabi in 4 container loads. My team has been busy assembling all those props here,” Sabu Cyril told Film Companion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X