twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి‌ గుట్టువిప్పేసాడు : ఉప్పుతో జలపాతం, వాటర్‌బాటిల్ శివలింగం ఇంకా...

    |

    Recommended Video

    బాహుబలి‌ గుట్టువిప్పేసాడు..!

    బాహుబలి సినిమా వచ్చిందీ... థియేటర్లలోనుంచి వెళ్ళిపోయింది అయినా సరే... ఇప్పటికీ ఆ సినిమా గురించిన ప్రతీవార్తా ఇంట్రస్తింగ్ గానే ఉంటుంది. ఇన్నాళ్ళ తర్వాత కూడా బాహుబలి అనే పేరు వినిపిస్తే చాలు ఆసక్తిగా చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. టాలీవుడ్ రేంజ్ ని అమాతం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోయింది. ఆ సినిమా వెనుక ఉన్న కొన్ని విషయాలని మళ్ళీ ఒక సారి చెప్పాడు... ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన సాబు సిరిల్. ఇండీవుడ్ ఫిలిమ్ కార్నివాల్‌లో మాట్లాడుతూ పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా తాను చేసిన బాహుబలి సినిమా వెనుక ఉన్న విషయాలని ఇలా చెప్పాడు....

    వాటర్ బాటిల్స్‌తో శివలింగం

    వాటర్ బాటిల్స్‌తో శివలింగం

    ఆయన చెప్పిన వాటిల్లో బాహుబలి.. రాబో 2.0 చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. వాటిని చూస్తే.. బాహుబలిలో స్పటిక లింగం నేపథ్యంలో వచ్చే సన్నివేశం కోసం వాటర్ బాటిల్స్ ఉపయోగించి శివలింగాన్ని తయారు చేశాం. తక్కువ ఖర్చు కావటంతో పాటు.. చాలా బాగా వచ్చింది.

    పంటలు కోయటానికి

    పంటలు కోయటానికి

    ఇదే చిత్రంలో రానా రథానికి ఉన్న తిరిగే కత్తి వెనుక ఒక కథ ఉంది. పూర్వంలో పంటలు కోయటానికి ఇలాంటి వాటినే వాడేవారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చేశాం. ఇది చాలా అద్బుతంగా అందరి దృష్టినీ ఆకర్షించింది

    జలపాతం కోసం ఉప్పు

    జలపాతం కోసం ఉప్పు

    బాహుబలి మూవీలో నాజర్ కు ఒక చేయి పని చేయదు. అంగవైకల్యం ఉన్న చేయిలా కనిపించే ఒక కృత్రిమ చేయిని అమర్చాం. అసలు చేతిని కనిపించకుండా ఉండేందుకు పైన శాలువా లాంటి వస్త్రాన్ని ఉంచాం. అందంగా కనిపించే జలపాతం కోసం ఉప్పును వాడాం.

    బాహుబలి కోసం

    బాహుబలి కోసం

    ఐదేళ్ల పాటు బాహుబలి కోసం పని చేశా. ఉదయం నాలుగున్నరకు లేచి పని మొదలు పెడితే రాత్రి నిద్రపోయేసరికి పదకొండున్నర అయ్యేది. ఈ టైంటేబుల్ క్రమం తప్పకుండా ఐదేళ్లు సాగింది. చాలా సీన్లు చూసినప్పుడు సీజీ వాడేశారని అనుకుంటారు.కానీ.. చాలా సందర్భాల్లో అలా జరగదు.

    కళాదర్శకుడి అవసరం

    కళాదర్శకుడి అవసరం

    అన్ని సన్నివేశాలకు సీజీ చేయటం సాధ్యం కాదు. అప్పుడే కళాదర్శకుడి అవసరం ఉంటుంది. బాహుబలి మూవీలో వాడిన ఆయుధాల్లో ఎక్కువ శాతం ఫైబర్ గ్లాస్ తో తయారు చేసినవే. బరువు తక్కువగా ఉండి వాడటానికి ఈజీగా ఉండేలా రూపొందించాం.

    వాటర్ హీటర్‌తో రోబో

    వాటర్ హీటర్‌తో రోబో

    ఇక.. శంకర్ దర్శకత్వంలో రానున్న రోబో 2.0 సినిమాలో మూడున్నర అడుగులు.. నాలుగున్నర అడుగులు ఉండే రోబోల అవసరం ఏర్పడింది. ఓ కంపెనీ వారిని కలిస్తే రోబోల తయారీకి రూ.5 కోట్లు అవుతుందని చెప్పారు. దీంతో.. వాటర్ హీటర్ బాడీలను ఉపయోగించి రోబోలను తయారు చేశాం. ఖర్చు రూ.5లక్షలతోనే పూర్తి అయ్యింది.

    English summary
    Sabu Cyril opens up about what went into bringing Rajamouli’s vision alive and how the role of a production designer has changed with the advent of visual effects. Excerpts from an interview
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X