»   »  షారుక్ హీరోయిన్‌కు బిడ్డ కూడా.. ఆమె జీవితం గురించి తెలిస్తే షాకే..

షారుక్ హీరోయిన్‌కు బిడ్డ కూడా.. ఆమె జీవితం గురించి తెలిస్తే షాకే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌ నటించిన రయీస్ చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆ చిత్రంలో మహిరాఖాన్ తళుక్కున మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నది. గతంలో ఎన్నడూ మీడియాలో పెద్దగా కనిపించని ఈ పాకిస్థాన్ హీరోయిన్ జీవితం వెనుక చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు దాగున్నాయి. ఆమె బాధలు తెలిస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం.

 రయీస్‌కు ముందే భర్తతో విడాకులు

రయీస్‌కు ముందే భర్తతో విడాకులు


రయిస్ చిత్రంలో నటించడానికి ముందే మహీరాఖాన్‌ భర్తతో విడాకులు తీసుకొన్నది. ఆమె అజ్లాన్ అనే బిడ్డకు తల్లి కూడా. ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలు మహిరాపైనే ఉన్నాయి. తన జీవితంలోని వెలుగు నీడలను ఇటీవల మీడియాతో పంచుకొన్నారు.

 నా కొడుకే నా ప్రపంచం

నా కొడుకే నా ప్రపంచం


ప్రస్తుత పరిస్థితుల్లో నా బిడ్డ బాగోగులే అత్యంత ప్రధానం. నా పిల్లాడి సంరక్షణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఒకసారి ఒకే చిత్రాన్ని చేస్తాను. చాలా అవకాశాలు వచ్చాయి కానీ నా బిడ్డ కోసం వదులుకొన్నాను. పేరు, డబ్బు తెచ్చే మంచి పాత్రలను పోషించాలని ఉంది.

 ఐశ్వర్యరాయ్ ఎలా తన బిడ్డ గురించి

ఐశ్వర్యరాయ్ ఎలా తన బిడ్డ గురించి


బాలీవుడ్ ప్రముఖ తార ఐశ్వర్యరాయ్ తన బిడ్డ గురించి ఎలా ఆలోచిస్తారో నేను కూడా నా బిడ్డ గురించి ఆలోచిస్తాను. మాతృత్వం అంటే అదే. ఎక్కడ ఉన్న నా ఆలోచనలన్ని నా కొడుకుపైనే ఉంటాయి.

 అమెరికాలో భర్తతో పరిచయం.. ప్రేమ.. పెళ్లి

అమెరికాలో భర్తతో పరిచయం.. ప్రేమ.. పెళ్లి


అమెరికాలో చదువుకునేటప్పడు తొలిసారి నా భార్త అలీ అస్కరీని లాస్ ఏంజెల్స్‌లో కలుసుకున్నానను అని మహిరా తెలిపింది. ఆ తర్వాత ప్రేమలోపడ్డాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. 2007లో పెళ్లి జరిగింది. హమ్ సఫర్‌ సీరియల్‌లో మంచి పేరు వచ్చింది. మంచి అవకాశాలు వస్తున్నాయి. అప్పుడే తన భర్త నటించవద్దని ఆంక్షలు పెట్టారు. దాంతో తమ మధ్య విభేదాలు వచ్చాయి. 2012లో అలీ, నేను విడాకులు తీసుకొన్నాం. అప్పటికే మాకు కొడుకు పుట్టాడు అని మహీరా తెలిపింది.

 అప్పుడు చావాలనిపించింది.. కొడుకు గుర్తొచ్చాడు..

అప్పుడు చావాలనిపించింది.. కొడుకు గుర్తొచ్చాడు..


వైవాహిక జీవితం అంధకారంలో పడిన తర్వాత నిర్వేదం ఆవహించింది. చావు తప్ప మరోటి లేదనిపించింది. ఆ సమయంలో కొడుకు గుర్తొచ్చాడు. కుమారుడిని తీసుకొని నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాను. నటనను మాత్రం వదులుకోలేదు. పాకిస్థాన్‌లోనూ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రయీస్‌లో షారుక్ ఖాన్ అవకాశం ఇచ్చారు.
రయీస్‌లో నటిస్తుండగానే బాలీవుడ్‌లో అవకాశాలు తలుపుతట్టాయి.

 యూరీ ఘటనతో మళ్లీ కష్టకాలం

యూరీ ఘటనతో మళ్లీ కష్టకాలం


జీవితంలో పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని అనిపిస్తుండగానే మళ్లీ కష్టకాలం మొదలైంది. భారత్, పాక్ సరిహద్దులో ని యూరీలో సైనికులపై దాడి జరిగిన నేపథ్యంలో ఆంక్షలు విధించారు. పాక్ నటులున్న భారతీయ సినిమాలను, యాక్టర్లను నిషేధించాలనే ఆందోళన మొదలైంది. ఆ సమయంలో ఏం చేయాలో తోచడం లేదు. రయీస్ హిట్ తర్వాత చాలా మంది అవకాశాలు ఇచ్చేందుకు వస్తున్నారు. రయీస్‌లో తాను ముస్లిం యువతిగా నటించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ కూడా చిత్రంపై నిషేధించారు.

 మహిరా ఖాన్ మూలాలు భారత్‌లోనే..

మహిరా ఖాన్ మూలాలు భారత్‌లోనే..


జన్మత మహీరాఖాన్ పాకిస్థాన్ కు చెందినా ఆమె మూలాలన్నీ భారత్‌లోనే ఉన్నాయి. మహిరా తండ్రి హఫీజ్ ఖాన్ స్వతంత్రానికి పూర్వం ఢిల్లీలో జన్మించారు. దేశ విభజన సమయంలో ఆయన పాకిస్థాన్ కు వెళ్లారు. ఎప్పడూ తన అమ్మమ్మ మీరట్ గురించి విషయాలు చెప్పేది. ఇప్పుడు ఇండియాలోనూ నాకు బంధువులు ఉన్నారు. ముంబైకి వచ్చినప్పుడు వారిని కలుస్తాను.

English summary
Mahira Khan's dream debut Raees with Shahrukh Khan turned into a nightmare after the URI attack when all the Pakistani actors were banned from the country. Before Raees Mahira Khan got divorced from her husband Ali Askari in 2012. She has a son Azlaan too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu