»   » బాలకృష్ణ సరసన నటించిన తర్వాత కూడా నాకు అవకాశాలు అందిరాలేదు..

బాలకృష్ణ సరసన నటించిన తర్వాత కూడా నాకు అవకాశాలు అందిరాలేదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల కాలంలో హీరోయిన్లు వాళ్శు నటించినటువంటి సినిమాలు సరిగా ఆడకపోవడంతో చాలా మంది వారి పేర్లు మార్చుకుంటున్నారు. పేరు మారిస్తే ఏమైనా అదృష్టం పడుతుందేమోనని. గతంలో కూడా ఇలాంటి సంఘటనులు చాలా చూశాం. బాలకృష్ణ సరసన నరసింహానాయుడు లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలో నటించినటువంటి ఆశాషైనీ ఆసినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో తన పేరుని మయూరిగా మార్చుకున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తన భవిష్యత్ కోసం పేరు మార్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఆహీరోయిన్ అని అనుకుంటున్నారా..

జయం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సదా గత కొంత కాలంగా తెలుగు తెరపై కనుమరుగయ్యారు. అందాలు ఒలకబోసి, గ్లామర్ గా కనిపించినా కూడా అవకాశాలు రాలేదు ఈ భామకు. కాగా ప్రస్తుతం తనపేరు మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. తోలి చిత్రం 'జయం' మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో సదా క్రేజీ హీరోయిన్ గా మారారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలుచిత్రాల్లో నటించిన తనకు కన్నడంలో 'మోనాలిసా', తమిళంలో 'అన్నియన్' (తెలుగు లో అపరిచితుడు) వంటి మంచి విజయాలు ఆమె ఖాతాలో వున్న సదా కెరీర్ ఏమి మెరుగుపడలేదు. తెలుగులో బాలకృష్ణ వంటి అగ్రహీరోతో 'వీరభద్ర' చిత్రం చేసినా అగ్రనాయిక హోదా ఈ తారకు ఏనాడు లభించలేదు.

అంతేకాదు మొన్నీమధ్య బాలీవుడ్ లోకూడా సదా తన అదృష్టాన్ని పరిక్షి౦చుకున్నా అక్కడ కూడా ఆమె ఆటలు ఫలించలేదు. అసలు తన కెరీర్ ఇలా దుర్భరంగా తయారవ్వటానికి ఏమిటా అని ఆలోచించి తుదిగా తన పేరును 'సదాఫ్' గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారట ఈ తార. సదా అసలు పేరు సదాఫే అయినా అందరికీ ఆమె సదాగానే సుపరిచితురాలు. అయితే ఆమె తన అసలు పేరు సదాఫ్ కు ఏదైనా కొసరు పేరు తగిలించి ఆపేరుతో చలామణి కావాలనే యోచనలో ఉన్నారట. చూద్దాం పేరు మార్చుకుంటేనైనా స్టార్ డమ్ వస్తుందేమో.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu