సాహోలో దుమ్ము దులిపే యాక్షన్ సీన్.. హాలీవుడ్ స్థాయిలో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహూ. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రన్ రాజ రన్ ఫేమ్ సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ చిత్రంగా సాహూ రూపొందుతోంది. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ సుందరి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ కు జాతీయ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. దీనితో సాహూ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ దుబాయ్ లోని కీలక లొకేషన్లలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ ఆధ్వర్యంలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.

ఈ యాక్షన్ సన్నివేశం చిత్రంలో 20 నిమిషాల పాటు సాగుతుందట. మేజర్ బడ్జెట్ కూడా ఈ ఫైట్ సీన్ కోసమే ఖర్చు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాహూ చిత్రం ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











