»   » కృష్ణవంశీతో పనిచేస్తున్నా అంటే.. చిరంజీవి చాలా చెప్పారు..

కృష్ణవంశీతో పనిచేస్తున్నా అంటే.. చిరంజీవి చాలా చెప్పారు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ హీరోగా ముద్ర పడిన సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. నటనలో సొంత ఐడెంటిని క్రియేట్ చేసుకోవడానికి విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. డ్యాన్సులు, ఫైట్లతో ఈ మెగా హీరో ఇరుగదీస్తున్నారు. ఆ క్రమంలో తేజ్‌కు వచ్చిన అవకాశమే నక్షత్రం. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌తో పనిచేసే అవకాశాన్ని దక్కించుకొన్నారు.

కృష్ణవంశీ రూపొందిస్తున్న నక్షత్రం చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, సందీప్‌ కిషన్, రెజీనా జంటగా సాయిధరమ్‌ తేజ్, ప్రగ్యా జైశ్వాల్‌, కృష్ణవంశీ, నిర్మాతలు ఎస్‌ వేణుగోపాల్, సజ్జు, కే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడారు.


క్యారెక్టర్ ఉంటే చేస్తా

క్యారెక్టర్ ఉంటే చేస్తా

గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ సమయంలో రామ్‌చరణ్‌ను కలవడానికి వెళ్లాను. అప్పుడు కృష్ణవంశీతో జరిగిన మాటల సందర్భంగా ‘ఎప్పుడైనా మీ సినిమాలో ఓ క్యారెక్టర్‌ ఉంటే చెప్పండి. చేస్తా' అని అన్నాను. నా మాటలను బాగా గుర్తుపెట్టుకొని ‘నక్షత్రం'లో అలెగ్జాండర్‌ అనే మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. అలెగ్జాండర్ పాత్ర చాలా ఉద్వేగంతో కూడుకొన్నది. నటుడిగా నాకు బాగా పేరు తెచ్చే పాత్ర అవుతుంది అని సాయి పేర్కొన్నారు.


నువ్వెంతో నేర్చుకొంటావు..

నువ్వెంతో నేర్చుకొంటావు..

నక్షత్రం చిత్రంలో నటించే అవకాశం వచ్చిన తర్వాత అలెగ్జాండర్‌ చిరంజీవి, పవన్ కల్యాణ్ మామయ్యాలను కలిశాను. కృష్ణవంశీ సినిమాలో ఓ క్యారెక్టర్‌ చేస్తున్నాను అని వారికి చెప్పాను. అందుకు వారు వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అన్నారు. కృష్ణవంశీ దగ్గర పనిచేస్తే నువ్వెంతో నేర్చుకొంటావని చిరంజీవి మావయ్య చెప్పారు అని అన్నారు.


కాలేజి స్టూడెంట్‌లా

కాలేజి స్టూడెంట్‌లా

నక్షత్రం సినిమా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. కెరీర్ ఆరంభంలోనే భావోద్వేగమైన పాత్ర చేసే అవకాశం రావడం నిజంగా అదృష్ణం. ప్రతి రోజూ ఈ సినిమా షూటింగ్ కాలేజి స్టూడెంట్‌‌లా వెళ్లాను. కృష్ణవంశీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను అని సాయి తెలిపారు.


నిరాశ పరచదు..

నిరాశ పరచదు..

ఆడియో ఫంక్షన్‌లో కృష్ణవంశీ మాట్లాడుతూ ‘డెఫినెట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశ పరచదు. సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారు. అందరూ చాలా కష్టపడి చేశారు. నేనూ కష్టపడి చేశాను అని అన్నారు.


శ్రీయాకు ఆడియో

శ్రీయాకు ఆడియో

నక్షత్రం చిత్రంలో సందీప్‌ కిషన్, రెజీనా జంటగా సాయిధరమ్‌ తేజ్, ప్రగ్యా జైశ్వాల్‌ కీలక పాత్రలను పోషించారు. ఎస్‌ వేణుగోపాల్, సజ్జు, కే శ్రీనివాసు నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందిందింది. భీమ్స్‌ సిసిరోలియో, భరత్, హరి గౌర సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. పాటల సీడీలను ఆవిష్కరించిన సాయిధరమ్‌ తేజ్, సందీప్‌ కిషన్‌లు, తొలి సీడీని శ్రియ, రెజీనా, ప్రగ్యాలకు అందజేశారు.English summary
Director Krishna Vamshi latest movie is Nakshatram. Sai DharamTej, Sandeep, Regina are prime cast. This movie audio release function organised in hydeabad on Wednesday. Actress Shirya is the special attraction for the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu