twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణాలకు ఎందుకంత విలువ ఇవ్వం? డబ్బు ముఖ్యం కాదు.. త్రివిక్రమ్, దిల్ రాజు, సాయిధరమ్ తేజ్ ఆవేదన

    |

    ఫిల్మ్ జర్నలిస్టుల భద్రతకై ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌....

    'ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' (ఎఫ్ఎన్ఏఈఎమ్‌) సభ్యులకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో హెల్త్ కార్డులను, అసోసియేషన్ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ డైరీని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యుల ఐడీ కార్డులను ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, టర్మ్ పాలసీని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన నవీన్ ఎర్నేని, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), యాక్సిడెంటల్ పాలసీని సాయిధరమ్ తేజ్, మెడికల్ పాలసీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు. గతంలో అధ్యకక్షుడిగా పనిచేసిన ప్రసాదం రఘు నూతన కార్యవర్గాన్ని అందరికీ పరిచయం చేశారు.

    ఇక నుంచి 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌...' సభ్యులతో పాటు వారి కుటుంబంలో ముగ్గురికి ఆదిత్య బిర్లా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కింద రూ. 3 లక్షల మెడికల్ కవరేజ్, సభ్యులకు ఆదిత్య బిర్లా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ. 25 లక్షల యాక్సిడెంటల్ కవరేజ్, ఎస్‌బిఐ టర్మ్ పాలసీ కింద రూ. 15 లక్షల కవరేజ్ లభిస్తాయి.

    నటుడిగా నా వంతుగా మద్దతు

    నటుడిగా నా వంతుగా మద్దతు

    సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ "ఒక సదుద్దేశంతో నన్ను సంప్రదించారు. నేను చాలా సంతోషంగా ఈ లక్ష్యసాధనలో ఓ భాగం అయ్యాను. ప్రతి సినిమాకూ మీడియా ప్రతినిధులు మద్దతు ఇస్తూ, ఆశీర్వదిస్తున్నారు. నటుడిగా ఈ లక్ష్యానికి నావంతు మద్దతు ఇవ్వాలని అనుకున్నా అని అన్నారు.

     గో ఎహెడ్ అంటూ దిల్ రాజు

    గో ఎహెడ్ అంటూ దిల్ రాజు

    'దిల్' రాజు మాట్లాడుతూ "ఒక సదుద్దేశంతో 'ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' చేస్తున్న కార్యక్రమం ఇది. రఘు, ఇతర అసోసియేషన్ సభ్యులు వచ్చి నన్ను కలిశారు. 'చేసేది మంచి పని అయినప్పుడు నేనే ముందుంటాను. గో ఎహెడ్' అని చెప్పాను. 20 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఇక్కడ ఉన్న మీడియా వాళ్లు అందరూ చాలా క్లోజ్. వారంలో ఒక్కసారైనా ఏదో ఒక ఈవెంట్‌లో కలుస్తుంటాం. అటువంటి నా మిత్రుల కోసం మంచి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.

     డబ్బు ఇంపార్టెంట్ కాదని దిల్ రాజు

    డబ్బు ఇంపార్టెంట్ కాదని దిల్ రాజు

    జర్నలిస్టుల కోసం సహాయం అందించడంలో డబ్బు ఇంపార్టెంట్ కాదు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాన్ని, మంచి పనిని ఎంకరేజ్ చేయాలని ముందుకొచ్చాను. మా నిర్మాతలు, హీరో తేజ్ కూడా ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇది ఇక్కడితో ఆగదు. ఇదే మొదలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు రావాలి. మనమంతా ఒక కుటుంబం" అన్నారు.

    క్రమశిక్షణ పాటిస్తాం అని త్రివిక్రమ్

    క్రమశిక్షణ పాటిస్తాం అని త్రివిక్రమ్

    ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ "ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్న 99 శాతం మంది జర్నలిస్టులు నాకు పేరుతో పరిచయం ఉన్నవాళ్లే. చాలా సంవత్సరాలుగా, 'స్వయంవరం' నుంచి నా ప్రయాణంలో తెలిసినవారే. బేసిగ్గా... సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ మొదలు పెట్టేటప్పుడు గానీ, విడుదల చేసేటప్పుడు గానీ చాలా క్రమశిక్షణ పాటిస్తాం. తెరవెనుక పనిచేసే కొందరి జీవితాలకు సంబంధించి మరింత క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం చాలా ఉంది. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్టుల్లో, మీడియాలో, మిగతా అన్ని రంగాల్లో ఉండేటువంటి వ్యక్తుల జీవితాలకు సంబంధించి చాలా ఆర్గనైజ్డ్ గా ఉండాలి. ఈ ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉంది. మనుషుల ప్రాణాలకు మనం ఎందుకంత విలువ ఇవ్వం? అని ఆలోచిస్తుంటా అని త్రివిక్రమ్ అన్నారు.

    జర్నలిస్టుకు భరోసాకు యత్నం

    జర్నలిస్టుకు భరోసాకు యత్నం

    ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎంత భరోసా ఉంటుందో... ఫిల్మ్ జర్నలిస్ట్‌కు అంతే భరోసా ఉండాలి. ఆ బాధ్యత తీసుకునేలా అందరం ప్రవర్తించాలి. దానికి మేం ఏం చేయగలిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా చెబుతున్నా. ఆర్థికంగా అయినా... మరో రకంగా అయినా.. ముందుంటానని లక్ష్మీనారాయణ, రఘు, రాంబాబు తదితరులకు చెబుతున్నా. ఈ రోజు ఒక గొప్ప పనికి పునాది పడింది. ఈ అసోసియేషన్ ఒక స్ట్రక్చర్ ని తయారు చేస్తుంది. ఇది ఇంకా బలంగా... దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల్లోకి బలంగా వెళ్లాలని కోరుకుంటున్నా" అన్నారు.

     ఫిల్మ్ జర్నలిస్టుల జీవితాల్లో శుభదినం

    ఫిల్మ్ జర్నలిస్టుల జీవితాల్లో శుభదినం

    ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ "ఫిల్మ్ జర్నలిస్టుల జీవితాల్లో ఇదొక మంచి రోజు. జర్నలిస్టుల జీవితాలు అభద్రమైనవి. చాలా పెద్ద ఎత్తున జీవితాలు ఏమీ ఉండవు. కానీ, చాలా గౌరవ ప్రదమైన వృత్తి. జర్నలిస్టులు అంటే నలుగురికి తెలిసినవాళ్ళు. నలుగురు గౌరవించేవాళ్ళు. జర్నలిస్టుల్లో ఫిల్మ్ జర్నలిస్టులు వేరు. అందరూ కలిసి మెలిసి ఉంటారని నేను భావిస్తున్నా. వీరికి ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు.

    English summary
    The members of the Film Newscasters Association of Electronic Media were on Monday evening issued health cards and association ID cards at a grand event held in Hyderabad's Prasad Labs. Press Academy Chairman Allam Narayana unveiled the Association's diary. Prominent director and 'Matala Mantrikudu' Trivikram Srinivas unveiled the members' ID cards, while Naveen Erneni of Mythri Movie Makers and Suryadevara Radhakrishna (Chinababu) of Haarika & Hassine Creations unveiled the Term Policy. Sai Dharam Tej unveiled the Accidental Policy, while the Medical Policy was released by ace producer Dil Raju of Sri Venkateswara Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X