»   »  మెగా మావయ్యల 3 రూల్స్ ఫాలో అవుతున్నా: సాయి ధరమ్ తేజ్

మెగా మావయ్యల 3 రూల్స్ ఫాలో అవుతున్నా: సాయి ధరమ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి ఈ మధ్య కాలంలో తెరంగ్రేటం చేసి సక్సెస్ ఫుల్ గా దూసుకెలుతున్న హీరో సాయి ధరమ్ తేజ్. మెగా స్టార్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ ఇటీవల నటించిన 'సుప్రీమ్' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తో మావయ్య మెగాస్టార్ పాత ట్యాగ్ 'సుప్రీమ్' తాను సొంతం చేసుకున్నాడు.

తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కిన'సుప్రీమ్' చిత్రం బాక్సాఫీసు రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ధరమ్ తేజ్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. త్వరలోనే స్టార్ హీరో రేంజికి ఎదుగుతాడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 Sai Dharam Tej following three rules

తాను ముగ్గురు మావయ్యలైన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల నుండి మూడు ముఖ్యమైన రూల్స్ ఫాలో అవుతున్నానని, నేను సినిమాల్లోకి ఎంటరవ్వాలనుకున్నపుడే ఈ ముఖ్యమైన విషయాలు నాకు చెప్పారు. ఈ మూడింటిని ఫాలో అయితే సక్సెస్ అవుతాననే నమ్మకం ఉందని ఇటీవల ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.

అందులో మొదటిది 'నిర్మాత నష్టపోకుండా చూడటం, రెండోది పెర్ఫార్మెన్స్ పరంగా దర్శకుడిని సంతృప్తి పరచడం, అన్నింటికంటే ముఖ్యమైంది ఆడియన్స్ ను ఎంటర్టెన్ చేయడం' ముగ్గురు మావయ్యల నుండి ఈ మూడూ విషయాలను తాను నేర్చుకున్నానని తెలిపారు.

ఫ్యూచర్లో కమర్షియల్ సినిమాలతో పాటు ఎక్సపర్మెంటల్ సినిమాలు కూడా చేస్తానని, రెండింటిని సమతుల్యం చేస్తూ కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తానని, అదే విధంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా మంచి కథలపై ఫోకస్ పెట్టినట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

English summary
Sai said that all his Mega uncles, Chiru, Pawan and Naga Babu, gave him three rules to always follow before he stepped into films seven years ago. And those important rules were, "take care of your producer, satisfy your director and entertain the audiences."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu