»   » పార్టీ కార్యాలయం గోడ దూకిన సాయి ధరమ్ తేజ

పార్టీ కార్యాలయం గోడ దూకిన సాయి ధరమ్ తేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయిధరమ్‌తేజ్‌ ఓ పేద్ద గోడ ఎక్కి దూకేశాడు. అదేదో పార్టీ కార్యాలయంలా ఉంది. అతని ముందు ఓ పదిమంది రౌడీలున్నారు. వాళ్లు అక్కడి నుంచి పరుగుపెట్టి రైల్వేస్టేషన్‌లో దూరారు. అక్కడికీ వచ్చాడు. ఇంతకీ సాయిధరమ్‌తేజ్‌ వాళ్లని పట్టుకున్నాడా.. హీరో కదా పట్టుకోక తప్పదు. అనుకున్నట్లే పట్టి కొట్టేశాడు. ఇదంతా సినిమాలోని హీరోయిన్ రెజీనా కోసం చేశాడా. అది తెలియదు గానీ దర్శకుడు ఏఎస్‌రవికుమార్‌ చౌదరి పర్యవేక్షణలో ఈ సన్నివేశం సాగింది. గీతాఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.


దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. .''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. ఆ కొత్తదనాన్ని సాయిధరమ్‌ తేజ్‌ సినిమాలో చూస్తారు. ఇది స్క్రీన్‌ప్లేలో కొత్త ఒరవడి సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. చాలా భాగం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే తెరకెక్కించాం. ఒకే ఒక్క పైట్ సీన్ మిగిలి ఉంది. మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. '' అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో చేస్తున్న 32వ చిత్రం ఇది. మొదటి నుంచి దిల్ రాజుకి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమాకు తన భాగస్వామ్యం కూడా ఉంటే బావుంటుందని నిర్మాణ భాధ్యతలు ఆయనకు అప్పగించాను అన్నారు.


సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'పిల్లా నువ్వు లేని జీవితం..'. అనే టైటిల్ ఖరారు చేసారు. దీనికి అల్లు అరవింద్‌, దిల్‌రాజు నిర్మాతలు. శ్రీహరి, దువ్వాసి మోహన్, చంద్రమోహన్, సత్యకృష్ణన్, ధర్మవరం, రఘుబాబు తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు మరుధూరి రాజా, పాటలు చంద్రబోస్, అశోక్ తేజ, శ్రీమణి, సంగీతం అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి దాశరధి శివేంద్ర, ఆర్ట్ రమణ వంక, ఎడిటింగ్ గౌతంరాజు, నిర్మాత బన్ని వాసు, హర్షిత్, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎఎస్ రవికుమార్ చౌదరి.

English summary
Sai Dharam Tej new film under the direction of AS.Ravikumar Chowdary is currently progressing in Hrishekesh. Filmmakers recently shot important scenes in Singapore. Bunny Vasu is producing the film. According to latest film makers are considering 'Pilla Nuvvu Leni Jeevitam' for the title. Sai is making his debut with Rey in the direction of YVS.Chowdary.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu