»   » ‘పవనిజం’ సాంగ్ మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారు?

‘పవనిజం’ సాంగ్ మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘రేయ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్టు కోసం ‘పవనిజం సాంగ్' కూడా యాడ్ చేసారు. మరి ఈ సాంగును సినిమాలో ఉపయోగించుకోవడంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారు? అనే విషయాల గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.

ఈ నెల 27న ‘రేయ్' చిత్రం విడుదలవుతున్న తరుణంలో మీడియా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్. సినిమా విడుదల నేపథ్యంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, రేయ్ సినిమా తనకు ఎన్నో అనుభవాలను చూపించింది. నన్ను మరింత స్ట్రాంగ్ చేసింది అన్నారు.


నేను సినిమా రంగంలో అడుగు పెట్టిన తొలి రోజు నుండే నాకు నా ఫ్యామిలీ సపోర్టు పూర్తిగా ఉంది. వారి సపోర్టు లేకుండా నేను ఇక్కడి వరకు వచ్చేవాడినికాదు. కష్ట పడి పని చేయాలని, మనం చేసే హార్డ్ వర్కే అన్నింటికి సమాధానం అని అమ్మ చెబుతుండేది. చరణ్, బన్నీ ఇలా అందరూ నాకు హెల్ప్ చేసారు, సపోర్టివ్ గా నిలిచారు అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.


Sai Dharam Tej Reveals Pawan Reaction on 'Pawanism' Song

వైవిఎస్ చౌదరిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనతో కలిసి చాలా కాలం కలిసి పని చేసారు. నాకు పెద్దన్నయ్యలాంటి వారు. ఆయనతో మరోసారి చేసే అవకాశం వస్తే తప్పుకుండా చేస్తాను అన్నాడు తేజు. ఈ సినిమాలో సయామీ ఖేర్, శ్రద్ధా దాస్ లీడింగ్ హీరోయిన్లుగా చేసారు. ఇద్దరూ మంచి క్యారెక్టర్లు చేసారు. తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.


చిరంజీవి ‘గోలీమార్', పవనిజం సాంగ్ సినిమాలో వాడటంపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ....‘పెద్ద మావయ్య ఓసారి నాతో మాట్లాడుతూ...ప్రతి టెక్నీషియన్‌ని గౌరవించాలని చెప్పారు. మన రియల్ లైఫ్ క్యారెక్టర్ చాలా ముఖ్యమని చెప్పారు. దర్శకుడి హీరోగా ఉంటూనే నిర్మాతకు భారం కలిగించకుండా చూడాలి అని చెప్పారు. అందుకే ఆయన మాటలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. సినిమాలో గోలిమార్ సాంగ్ చాలా బాగా వచ్చింది అన్నారు.


పవనిజం సాంగ్ సాంగ్ చాలా రోజుల క్రితమే కంపోజ్ చేసాము. ఓ రోజు నేను పవన్ మావయ్య ఈవిషయమై అడిగాను. ఆయన ఎప్పటిలాగే ఓ చిరు నవ్వు నవ్వి ఓకే చెప్పారు. ‘మీకు నిజంగా అవసరం అయితే చేయండి' అని సమాధానం ఇచ్చారు అని తెలిపారు.


‘రేయ్' చిత్రం ఈ నెల 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ‘A' సర్టిఫికెట్ జారీ చేసింది. అంతే కాకుండా సినిమాలో 41 చోట్ల సెన్సార్ కట్స్ విధించింది.

English summary
"Pawanism song was composed long back. One day, I said, 'Mavayya we are doing a special song you'. He gave his trademark smile and said, 'Do you guys really need it? Hmm... Ok.. Carry on" Pawan Kalyan said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu