twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటిలిజెంట్‌ ఫస్ట్‌‌లుక్‌ సూపర్.. సాయిధరమ్‌ కేరీర్లోనే బిగ్గెస్ట్ హిట్

    By Rajababu
    |

    Recommended Video

    'ఇంటిలిజెంట్'పై కత్తి కామెంట్..!

    సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటిలిజెంట్‌'. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    అద్భుతంగా ఇంటెలిజెంట్

    అద్భుతంగా ఇంటెలిజెంట్

    ఈ సందర్భంగా నిర్మాత సి కల్యాణ్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ టోటల్‌గా పూర్తయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సాయిధరమ్‌తేజ్‌ పెర్‌ఫార్మెన్స్‌, వినాయక్‌ టేకింగ్‌ హైలైట్‌గా ఈ చిత్రం రూపొందింది అని అన్నారు.

    సాయి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్

    సాయి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్

    సాయిధరమ్‌, వినాయక్‌ కెరీర్‌లో 'ఇంటిలిజెంట్‌' మరో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ అవుతుంది. అలాగే మా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో మరో కమర్షియల్‌ హిట్‌ సినిమాగా నిలుస్తుంది అని నిర్మాత సీ కల్యాణ్ పేర్కొన్నారు.

    ఫిబ్రవరి 9న రిలీజ్

    ఫిబ్రవరి 9న రిలీజ్

    పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తిచేసి ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని కల్యాణ్ అన్నారు.

    నటీనటులు వీరే

    నటీనటులు వీరే

    సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్నారు.

    సాంకేతికవర్గం

    సాంకేతికవర్గం

    కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

    English summary
    After directing Megastar Chiranjeevi in his landmark 150th film 'Khaidi No.150', director VV Vinayak is back — this time with Chiranjeevi's nephew Sai Dharam Tej. The big-budget film is titled 'Intelligent' and is set to hit screens next month.Producer C Kalyan, who's bankrolling the film, announced that Intelligent will be releasing worldwide on February 9. This movie first look released on January 22nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X