»   » బిగ్ ఫైట్‌కు దూరంగా మెగా మేనల్లుడు, ఎన్టీఆర్ డేట్‌తో రంగంలోకి!

బిగ్ ఫైట్‌కు దూరంగా మెగా మేనల్లుడు, ఎన్టీఆర్ డేట్‌తో రంగంలోకి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ మేనలుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'జవాన్' చిత్రంలో నటిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్. బివిఎస్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రం కూడా దసరా సీజన్లోనే విడుదల చేయాలని మొదట భావిచారు. అయితే ఆ సమయంలో స్పైడర్, జై లవకుశ, పైసా వసూల్ లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద బిగ్ పైట్‌కు సిద్ధం కావడంతో..... ఆ ఫైట్ నుండి తెలివిగా ఎస్కేప్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. తన సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు.


ఎన్టీఆర్ డేట్...

ఎన్టీఆర్ డేట్...

సెప్టెంబర్ 1... గతేడాది ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్' విడుదలైన డేట్. అప్పట్లో ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ‘జవాన్' విషయంలోనూ ఆ డేట్ మరోసారి మ్యాజిక్ చేస్తుందో? లేదో? చూడాలి.


సినిమా గురించి దర్శకుడు

సినిమా గురించి దర్శకుడు

దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ... జ‌వాన్ చిత్రం కాన్సెప్ట్ ఎంట‌ని అంద‌రూ అడుగుతున్నారు. మా మెద‌టిలుక్ అంద‌రిలో ఆ క్యూరియాసిటి తెచ్చింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టివ‌ర‌కూ చెయ్య‌ని ఓ మంచి పాత్ర‌లో చేస్తున్నాడ‌నేది మాత్రం చెప్ప‌గ‌ల‌ను. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని మ‌నోదైర్యంతో త‌న బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే మా కాన్సెప్ట్. మా చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.


నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

కెమెరా మెన్ - కెవి గుహన్, మ్యూజిక్ - తమన్, ఆర్ట్ - బ్రహ్మ కడలి, ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్, సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి, బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్, సమర్పణ - దిల్ రాజు, నిర్మాత - కృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి.English summary
Sai Dharam Tej - BVS Ravi's Jawan release on 1 September.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu