»   » సాయి ధరమ్ తేజ్ కొత్త ఫీట్ అగ్ర హీరోలకే సాధ్యం కాలేదు

సాయి ధరమ్ తేజ్ కొత్త ఫీట్ అగ్ర హీరోలకే సాధ్యం కాలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయిధరమ్ తేజ్ మరింత స్పీడుగా కనిపిస్తున్నాడు.మెగా హీరోలలో ఉన్న ఒక ప్రత్యేకథ ఒకేసారి అటు మాస్ నీ,ఇటుక్లాస్ నీ... కొత్త తరం యువకులనూ అకట్టుకునే విధంగానే ఉంటాయి ప్రతీసినిమా. ఏ..,బీ సెంటర్ ల ప్రస్తావన చిరంజీవి కాలం నుంచీ లేదు.

స్వయం కృషీ,ఆపద్బందవుడూ వంటి సినిమాలు కమర్షియల్ గా కాస్త నిరాశ పరిచినవే అయినా సీ క్లాస్ ఆడియన్స్ కూడా మెచ్చుకున్న సినిమాలే. ఇప్పుడు కొత్తగా వచ్చిన మెగా వారసుల్లోనూ అదే కనిపిస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ అల్లుడు సాయి ధరం తేజ్ కి కూడా మంచి మాస్ లుక్ తో పాటు ఇటు క్లాస్ నీ ఆకట్టుకోగల లక్షణాలు కూడా ఉన్నాయి.


sai dharam tej's subramanyam for sale reached 50 lakh views

అలాంటి సాయిధరమ్ తేజ్ నటించిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను ఇంతవరకూ యూ ట్యూబ్ లో చూసినవారి సంఖ్య 50 లక్షలు దాటేసింది.ఒక తెలుగు సినిమాను యూ ట్యూబ్ లో ఈ స్థాయిలో చూడటం అరుదైన విషయమని చెబుతున్నారు.


ఇన్ని సంవత్సరాలలోనూ ఒక తెలుగు సినిమాకి ఇన్ని వ్యూస్ రావటం జరగలేదు అందులోనూ ఇంత తక్కువ సమయం లో. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, రెజీనా కథానాయికగా అలరించింది. కథ .. కథనాలు .. మాటలు .. పాటలు ఇలా అన్ని అంశాలకి ఆడియన్స్ చకచకా మంచి మార్కులు వేసేశారు.


sai dharam tej's subramanyam for sale reached 50 lakh views

నిజానికి బ్లాక్ బస్టర్ అనిపించుకోకున్నా ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు యూ ట్యూబ్ లో ఈ సినిమా సాధించిన రికార్డు ఆయన అభిమానులను మరింత ఖుషీ చేస్తుందని చెప్పొచ్చు. మొదట్లో సాయి ధరమ్ మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపని వాళ్ళు కూడా అతని నటన చూసాక మెచ్చుకున్నారు.


మామలను అనుకరిస్తున్నాడు అనే మార్క్ కూడా సుప్రీం తో పోయినట్టే.. ఇక తనకంటూ ఒక ఓన్ స్టయిల్ క్రియేట్ చేసుకుంటున్నాడు ధరం తేజ్. ఇదే ఊపులో తొందర పడకుండా కెరీర్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే రాబోయే కాలం లో ధరం తేజ్ రేపటి తరం అగ్రహీరోల్లో ఒకడు గా కనిపిస్తాడు..

English summary
Mega family Hero Sai dharam tej's Movie "Subrahmanyam for Sale" is crossed 50 lakh views in YouTube.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu