»   » చిరు, పవన్ లను తలుచుకుంటూ ‘సుప్రీమ్’ ఆడియో వేడుక (ఫోటస్)

చిరు, పవన్ లను తలుచుకుంటూ ‘సుప్రీమ్’ ఆడియో వేడుక (ఫోటస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో వేడుక హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో గురువారం రాత్రి జ‌రిగింది. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.

నాని, వ‌రుణ్ తేజ్ క‌లిసి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అంజ‌నాదేవి బిగ్ సీడీని విడుద‌ల చేశారు. అల్లు అర‌వింద్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. నాని, వ‌రుణ్ తేజ్ తొలి సీడీల‌ను అందుకున్నారు.


ఈ సందర్భంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ఫ్యామిలీ ఆర్టిస్ట్ అంద‌రికీ థారు రోడ్డు వేసి న‌డిపించిన చిరంజీవిగారిని త‌ల‌చుకోవాలి. తేజ్ త‌ల్లి విజ‌య‌, అమ్మమ్మ కూడా అత‌ని విజ‌యం చూసి ఆనందించ‌డం నాకు సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీలో ఒళ్లుదాచుకోకుండా క‌ష్ట‌ప‌డే హీరో తేజ్‌. త‌న క‌ష్టం, త‌న ఆస‌క్తి త‌న‌ని ఎక్కువ హైట్స్ తీసుకెళ్తుంద‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిన‌ట్టు ఫీలింగ్ వ‌స్తోంది అని చెప్పారు.


దిల్‌రాజు మాట్లాడుతూ మా సంస్థ‌కు 13 ఏళ్లు పూర్త‌య్యాయి. 13 ఏళ్లకు ముందు నాతో శిరీశ్‌గారు, ల‌క్ష్మ‌ణ్‌గారున్నారు. 20 సినిమాలు తీస్తే 16 స‌క్సెస్‌ఫుల్ సినిమాలు చేశాం. ఏడుగురు ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేశాం. ఈ సినిమాలో ఈ బ్యాన‌ర్‌కి ప్రెజెంట‌ర్ అని వేసుకున్నాం. అది అల్లు అరవింద్‌గారిని చూసి నేర్చుకున్నా. సాయి చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు మా సంస్థ‌లోనే చేశాడు. ఈ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ అవుతుంది. సుప్రీమ్‌లో ఇంకో లెవ‌ల్‌కి ఎదుగుతాడు. చిరంజీవిగారితో సినిమా చేయాల‌నే కోరికను సాయితో కంప్లీట్ చేశాను. ప‌వ‌ర్‌స్టార్ సినిమా చేయాల‌నే కోరిక‌ను వ‌రుణ్తో చేసి తీర్చుకుంటాను అన్నారు.


స్లైడ్ షోటో మరిన్ని వివరాలు, ఫోటోస్..


వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ ``నేనూ, తేజ్ చిన్న‌ప్ప‌టి నుంచి ఫ్రెండ్స్ లా పెరిగాం. నాకు తెలిసిన‌వాళ్ళ‌లో మోస్ట్ హార్డ్ వ‌ర్కింగ్ బాయ్ అని తెలిపారు.


తేజ్ ను మోసే తగ్గాను

తేజ్ ను మోసే తగ్గాను

నేను, తేజ్ ఇద్ద‌రం కలిసి జిమ్‌లో ప‌రిగెడుతుండేవాళ్లం. త‌న‌ని చూసే నేను త‌గ్గాను. అని వరుణ్ తేజ్ అన్నారు.


ఆల్ ది బెస్ట్

ఆల్ ది బెస్ట్

అనిల్ రావిపూడిగారి ప‌టాస్ చూశాను. చాలా బాగా న‌చ్చింది. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి ఆల్ ది బెస్ట్ `` అని చెప్పారు వరుణ్ తేజ్


సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ

సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ

అభిమానుల్లో ఒక‌డిగా ఉన్న నేను ఇవాళ ఇలా వ‌చ్చి మాట్లాడ‌టానికి కార‌ణ‌మైన మా ముగ్గురు మావ‌య్య‌ల‌కి పాదాభివంద‌నం అన్నరు.


భయపడ్డాను

భయపడ్డాను

సుప్రీమ్ అనే టైటిల్ పెట్టుకోవ‌డానికి అర్హ‌త ఉండాలి. అందుకు విన‌గానే నాకు కంగారు వ‌చ్చింది. పెద్ద‌మావ‌య్య‌గారిద‌గ్గ‌రికి వెళ్లి ఈ విష‌యాన్ని చెప్తే ``నువ్వెందుకురా భ‌య‌ప‌డుతున్నాను. క‌ష్ట‌పడు`` అని అన్నారు సాయి ధరమ్ తేజ్.


పరువు నిలబెట్టాలని

పరువు నిలబెట్టాలని

ర‌క్తం చిందించి అయినా స‌రే క‌ష్ట‌ప‌డి ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అని అనుకున్నా. సుప్రీమ్ అనే పేరు పెట్టుకున్నందుకు చిరంజీవిగారి ప‌రువు నిల‌బెట్టాలి అని అనుకుని క‌ష్ట‌ప‌డ్డా అని తెలిపారు.


దిల్ రాజు గురించి

దిల్ రాజు గురించి

నిర్మాత రాజుగారితో ఇది నా మూడో సినిమా. నాకు ఎప్పుడైనా క‌థ న‌చ్చితే చెబితే ఎంక‌రేజ్ చేస్తుంటారు. శిరీష్ గారు ప్ర‌తి రోజూ సెట్‌కి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేశారు. ఎక్క‌డా ఖ‌ర్చుకు డోకా లేకుండా చేశారు అని తెలిపారు.


English summary
Supreme Movie Audio Release Function held at Hyderabad. Sai Dharam Tej, Raashi Khanna, Ravi Kishan, Srinivasa Reddy, Jaya Prakash Reddy, Anil Ravipudi, Gopichand Malineni, Harish Shankar, Sathyam Rajesh, Shreya Vyas, Vamsi Paidipally, Nani, Varun Tej, Dil Raju, Suma, Ramajogayya Sastry graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu