»   » మెగా మేనల్లుడి సంచలనం... ఒక్కరోజులోనే!

మెగా మేనల్లుడి సంచలనం... ఒక్కరోజులోనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాదక: సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చత్రం విన్న‌ర్‌. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

 Sai Dharam tej's Winner trailer crossed 1 million views

ట్రైలర్ కు యూట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం ఉదయం ట్రైలర్ రిలీజ్ కాగా... సోమవారం 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్స్ నటించిన సినిమాల ట్రైలర్లు ఒక రోజులో ఇలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకోవడం మామూలేగానీ.... ఇప్పుడిప్పుడే మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న సాయి ధరమ్ తేజ్ 1 మిలియన్ మార్క్ అందుకోవడం సంచలనమే అంటున్నారు.

ఈ సినిమా గురించి...సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. హార్స్ రేసుల కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమా షూటింగ్ టైంలో గోపీచంద్‌, ఛోటాగారు తీసుకున్న కేరింగ్ మ‌ర‌చిపోలేను. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. జ‌గ‌ప‌తిబాబుగారితో నేను చేస్తున్న సెకండ్ మూవీ. ర‌కుల్ కంటే ఈసినిమాలో జెబిగారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. థ‌మ‌న్ బ్యూటీఫుల్ ఆల్బ‌మ్ ఇచ్చాడు. అన్నీ పాట‌లు మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. గోపీచంద్‌గారు నాలోని స్పీడ్‌ను కంట్రోల్ చేసి నాలోని బెస్ట్ అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నారు. ఛోటాగారితో నేను చేసిన ఐదో సినిమా విన్న‌ర్‌. బుజ్జిగారు, మ‌ధుగారు ఖ‌ర్చుకు వెనుకాడ‌లేదు. ఎందుకంటే క‌థ బ్యాక్‌డ్రాప్ అలాంటిది. కానీ వారు ఏం మాత్రం వెనుకాడ‌లేదు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది అన్నారు.

English summary
Sai Dharam Tej's "Winner" trailer was out yesterday morning and has received a huge applause from the audience. Apart from the appreciation now it has officially crossed 1 million views on youtube. This is the first time that a movie teaser of Sai Dharam Tej achieved this feat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu